English | Telugu
ఆ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నా.. వైరల్ అవుతున్న సునీత పోస్ట్
Updated : Jul 6, 2022
జీవితం చాలా క్లిష్టమైనది. ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ బాధలు, ఆవేదనలు చిన్నచిన్న కవితలుగా కూడా రూపాంతరం చెందుతాయి. అలాంటివి చాలా అద్భుతంగా ఎంతో లోతైన భావాల్ని పలికిస్తాయి. అలాంటి ఒక సందర్భాన్ని సింగర్ సునీత కూడా అనుభవించినట్లు కనిపిస్తోంది. ఐతే సునీత హోరెత్తే సముద్రం ఒడ్డున ఎక్కడో దూరంగా ఉన్న పడవను ఎంతో తన్మయత్వంతో నిలబడి చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సముద్రం, దూరంగా ఉన్న ఓడ తనకేదో పాఠం నేర్పిస్తున్నట్టు తాను అలా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఈ ఫోటో చూస్తే. "మీరు డిమాండ్ చేయకపోతే మీ గురించి ఎవరూ పట్టించుకోరు. మీరు అందరిచేతా నిర్లక్ష్యం చేయబడతారు. నేను ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను" అంటూ లోతైన భావాన్ని కవితాత్మకంగా రెండే రెండు వాక్యాల్లో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
ఎదుటివాళ్లను నిర్లక్ష్యం చేయడం అనే విషయం చాలా బాధాకరమైంది..అలాంటి బాధ ఎవరికీ రాకూడదు. ఈ సముద్రం, ఆ చివరన ఉన్న పడవ కూడా నాలాంటి ఒక పరిస్థితిలోనే ఉన్నాయేమో. అందుకే తనలోని అలలను ఎగసెగసి పడేలా చేస్తోంది, చొచ్చుకుంటూ ఇంకాఇంకా ముందుకొచ్చేస్తోంది ఈ సముద్రం.. అలా రాకపోతే ప్రపంచం తనని నిర్లక్ష్యం చేస్తుందని నాలాగే సముద్రానికి, ఆ ఓడకు కూడా అర్దమయ్యిందేమో అంటున్నట్టుగా పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడే ఈ కామెంట్ ఎందుకు పెట్టిందనేది అందరిలోనూ కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
సునీత ఎప్పుడూ కెరీర్ అంటూ ఫామిలీ అంటూ బిజీగా ఉంటుంది. కానీ తాను ఎక్కువగా సూర్యదయాన్ని, సముద్రాన్ని, వర్షాన్ని, దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి చాలా ఇష్టపడుతుంది. అందుకే ప్రకృతికి సంబంధించిన ఫొటోస్ ని తన ఇన్స్టా పేజీలో ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కున్న మీరు చాలా స్ట్రాంగ్, మానసిక ప్రశాంతత చాలా అవసరం అంటూ సునీత ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.