English | Telugu
కసి వల్ల రోడ్డున పడిన తిలోత్తమ ఫ్యామిలీ!
Updated : Jul 7, 2022
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో వీక్షకుల్ని అలిరస్తోన్న సీరియల్ త్రినయని. జరగబోయేది ముందే తెలిసే వరం వున్న ఓ యువతి తన భర్తని ఆపదల నుంచి ఎలా కాపాడుకుంది, తన భర్త సవతి తల్లి కుట్రలని ఎలా చేధించింది, తన భర్త తల్లి హత్య వెనకున్న రహస్యాన్ని ఎలా తెలుసుకుంది? అనే ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ సీరియల్ ని రూపొందించారు. అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, విష్ణుప్రియ, శ్రీసత్య, భావనారెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు తదితరులు నటించారు.
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని బ్యాంక్ లోన్ కోసం వెళ్లిన విశాల్, నయనిలని అక్కడికి వచ్చిన తిలోత్తమ, కసి, వల్లభ అవమానిస్తారు.. లోన్ ఇవ్వకుండా అడ్డుపడతారు. అయితే పుండరీనాథం ప్రాంగణంలో లభించిన పెట్టెని లోనికి తీసుకొచ్చి తిలోత్తమతో ఓపెన్ చేయించేసరికి అందులో బంగారు నగలు, వజ్రాలు బయటపడతాయి. వీటి లెక్క ఎంతుంటుందో చెప్పండి అంటుంది నయని మేనేజర్ తో. కోట్లల్లో వుంటుందని, దీన్ని పెట్టుకుని 30 కోట్ల వరకు వెంటనే లోన్ ఇచ్చేస్తానంటాడు. అది విని తిలోత్తమ, కసి, వల్లభ షాక్ అవుతారు. వెంటనే వ్యాపారం ప్రారంభిస్తారని కసి అంటుంది. ఆ డబ్బుతో వ్యాపారం చేయడం లేదని, గాయత్రీ దేవి కంపెనీకి డిపాజిట్ గా ఇచ్చేస్తున్నామని చెప్పి షాకిస్తుంది నయని.
కట్ చేస్తే తిలోత్తమ ఇంట్లో చర్చ మొదలవుతుంది. నయని, విశాల్ ఎదుగుతున్నారని వారిని ఎలాగైనా ఆపాలని ఆలోచిస్తుంటారు తిలోత్తమ, కసి, వల్లభ. అది విన్న విక్రాంత్ మీ వల్ల కాదంటాడు. కట్ చేస్తే.. ఇంటికి వచ్చిన నయని.. కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నామని చెప్పి బొట్టుపెడుతుంది. దీనితో అయినా మీ తలరాత మారాలని చెబుతుంది. అంతలోనే ఇంటికి సీల్ వేసేస్తారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు సీల్ వేశారు.. తిలోత్తమ ఫ్యామిలీ కసి వల్ల ఎలా రోడ్డున పడింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.