English | Telugu

వసుధార, రాజీవ్ ల పెళ్ళిని రిషి ఆపగలడా..!

వసుధార ఇంటికి వస్తాడు రాజీవ్. చక్రపాణి, రాజీవ్ తో కంగారుగా మాట్లాడుతుంటాడు. "భయంగా ఉంది అల్లుడు గారు.. రిషి పెళ్లి ఆపేస్తానని అంటున్నాడు. నాకు కంగారుగా ఉంది" అని చక్రపాణి అంటాడు. దానికి రాజీవ్ మాట్లాడుతూ "మామయ్య.. మీరు ఏం టెన్షన్ పడకండి. మనం రిషి సర్ ని బెదిరించాల్సిన పని లేదు. భయపెట్టాల్సిన అవసరం లేదు. వసుధారతోనే 'రిషి సర్ నాకొద్దు' అనేలా చేస్తాను చూడండి" అని రాజీవ్ అంటాడు.

ఆ తర్వాత వసుధార గదిలోకి చీర తీసుకొని వెళ్తాడు రాజీవ్. అలా వెళ్ళగానే వసుధార చూస్తుంది. "బావ.. ఎందుకొస్తున్నావ్. ఇక్కడి నుండి వెళ్ళు" అంటూ అరుస్తుంది. అలా వసుధార అనేసరికి.. రాజీవ్ నవ్వుతూ మాట్లాడుతుంటాడు. "నువ్వు బావ.. బావ అని అనకు. నీకు కాబోయే భర్తని నేను. కాబట్టి ఇకనుండి ఏవండి.. ఏవండి అని ప్రాక్టీస్ చెయ్. నా ఫోన్ లో నువ్వు, రిషి సర్ కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి. నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకోకుంటే, వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అప్పుడు మీ ఫ్యామీలీలో ఎవరూ బ్రతకరు. ఒంటరిదానివి అవుతావు. నువ్వు దానికి కూడా ఒప్పుకోకపోతే, నేను ఈ గన్ ని వాడాల్సి వస్తుంది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే, నిన్ను ఏం చెయ్యను. ఎందుకంటే నువు నా ప్రాణానివి. నీ ప్రాణమైన రిషి సర్ కి మొదటి బుల్లెట్, మీ జగతి మేడంకి రెండవ బుల్లెట్, మీ మహేంద్ర సార్ కి మూడవ బుల్లెట్ వాడుతాను. మొదటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం అనే చెప్తున్నాను. నా ఇష్టం అంత కూడా పెళ్లి అయిన తరువాత టిఫిన్ చేస్తు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ రిషి సార్ వస్తాడు. నా చేతిలో చస్తాడు నా దగ్గర బుల్లెట్లు చాలా ఉన్నాయి. మీ రిషి సర్ తో సామరస్యంగా మాట్లాడి పంపించు. నేనేం మాట్లాడను. ఇది నీ పెళ్లి చీర. దీన్ని కట్టుకొని, నువ్వు తొందరగా రెడీ అయి వస్తే.‌. మనం తొందరగా పెళ్లి చేసుకుందాం. మన ఇద్దరి పెళ్లి అంటే నాకు గాల్లో తేలినట్లుంది. నేను కూడా అందంగానే ఉంటా, బాగానే సంపాదిస్తాను. నన్ను గన్ వాడే అవసరం రానివ్వవని అనుకుంటున్నాను. నువ్వు తెలివైన అమ్మాయివని నాకు తెలుసు" అని రాజీవ్ మాట్లాడి బయటకు వచ్చేస్తాడు.

ఆ తర్వాత వసుధార ఆలోచిస్తూ, పెళ్ళికి రెడీ అవుతుంటుంది. ఒకవైపు రాజీవ్ అన్న మాటలు, మరో వైపు రిషి సర్ తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది వసుధార. ఆ తర్వాత జగతి మేడం పంపిన మంగళ సూత్రాలని చూస్తుంది. "మేడం ముందు జాగ్రత్తతోనే ఇవి పంపినట్లుంది" అని అనుకుంటుంది. ఆ తర్వాత రిషి సర్ తన ముందు ఉన్నట్లు ఊహించుకుంటుంది. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.