English | Telugu

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాకింగ్ రాకేష్-సుజాత!

బుల్లితెర రియల్ లవర్స్ రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. జబర్దస్త్ వేదిక మీద వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. తనకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన రాకేష్ చివరికి సుజాత ప్రేమలో పడిపోయాడు.

ఇక సుజాత జోర్దార్ వార్తలు చదువుతూ ఫుల్ ఫేమస్ అయింది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా హౌస్ మేట్స్ కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే నూతన సంవత్సరం అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాకింగ్ రాకేష్, వాళ్ళ అమ్మ, జోర్దార్ సుజాత ముగ్గురూ వచ్చి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. రాకేష్-సుజాత ఇటీవలి కాలంలో అన్ని ప్లేసెస్ ని చుట్టేసి వస్తున్నారు. వీళ్ళు పెళ్లి కాకుండా అన్ని షోస్ లో కనిపిస్తున్నారు.

పెళ్ళెప్పుడు అని అడిగిన వాళ్లందరికీ త్వరలో పెళ్లి.. మీకు చెప్పే చేసుకుంటాం అని ప్రకటించారు. రాకేష్ తల్లి మాత్రం తనకు కాబోయే కోడలు సుజాత గురించి ప్రశంసలు కురిపించారు. పెళ్లి కాకుండా సుజాత రాకేష్ ఇంట్లో సభ్యురాలయ్యింది. జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ చిన్న పిల్లలతో స్కిట్స్ చేయిస్తూ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సీనియర్ కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.