English | Telugu

నేను ఇంతందంగా ఉన్నా ఒక్క ప్రపోజల్ కూడా రావట్లేదు!.. వాసంతి వింత బాధ!!

బిగ్ బాస్ హౌస్ నుంచి గ్లామర్ డాల్ వాసంతి కృష్ణన్ ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. ఆ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ గురించి, తన లవ్ ప్రపోజల్స్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. "నేను గతంలో అస్సలు బాగుండేదాన్ని కాదు.. ఓకేఓకేగా ఉండేదాన్ని. కానీ అప్పుడు చాలా మంది వెంటపడేవాళ్లు.. ఇప్పుడు ఇంత అందంగా ఉన్నా కూడా సీరియస్లీ.. ఒక్క ప్రపోజల్ కూడా రావట్లేదు. బిగ్ బాస్ అంటే ఏమోలే అనుకుని వెళ్లాను. కానీ ఏమో కాదది.. వామ్మో బిగ్ బాస్." అని కామెంట్ చేసింది.

తను తిరుపతిలో స్కూలింగ్, ఇంటర్ కంప్లీట్ చేశానని తెలిపిన ఆమె, "బెంగుళూరులో డిగ్రీ పూర్తి చేసాను. అలా అక్కడినుంచి మోడలింగ్ స్టార్ట్ చేసాను. బిగ్ బాస్ హౌస్‌లో నన్ను ఫన్నీగా ఏడిపించేది రేవంత్. హౌస్ లోకి నేను వెళ్లిన దగ్గర నుంచి నాతో ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు. ఐనా నేను బాధపడలేదు. కానీ హౌస్ లోకి వెళ్ళాలి అంటే మాత్రం షో గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్తే బాగా ఆడే అవకాశం ఉంటుంది." అని తెలిపింది.

"నాకు సుదీప అంటే చాలా ఇష్టం. నాకు ఎవరైతే దగ్గరగా ఉండేవారో వాళ్లంతా ఇంట్లోంచి వెళ్లిపోతుండేసరికిచాలా బాధేసేది. నేను హౌస్‌లో ఎప్పుడూ ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళాక బిగ్ బాస్ వాయిస్ మాత్రమే మాకు వినిపిస్తుంది. బిగ్ బాస్ టీమ్ నుంచి మాకు ఎలాంటి ఇన్‌పుట్స్ అనేవి రావు" అని వాసంతి ఎన్నో విషయాలు చెప్పింది.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.