English | Telugu

ఢీ-14 గ్రాండ్ ఫినాలేకి మాస్ మహారాజా!


సౌత్‌ ఇండియాలోనే అతిపెద్ద డ్యాన్స్‌ రియాలిటీ షోగా 'ఢీ' షో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే 13 సీజన్లు పూర్తి చేసుకుని.. ప్రస్తుతం 14వ సీజన్‌ దుమ్ము రేపుతోంది. మంచి రేటింగ్‌తో రన్‌ అవుతోంది. టాలెంట్ ఉన్న ఎంతో మందికి ఈ షో చక్కని వేదికగా నిలుస్తోంది. ఈ షో ద్వారా పరిచయమైన ఎంతో మంది నేడు టాప్‌ కోరియోగ్రాఫర్స్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ షోలో డ్యాన్స్‌తో పాటు టీమ్‌ లీడర్స్‌, యాంకర్స్, జడ్జెస్‌ అందరూ కలిసి చేసే ఫన్నీ స్కిట్లు కూడా ఆడియన్స్‌ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. వీటికి మిలియన్ల కొద్ది వ్యూస్‌ వస్తూ ఉంటాయి. టాప్‌ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దిశగా అడుగులేస్తోంది.

ఏదైనా షో ఫైనల్‌కి చేరుకున్నప్పుడు ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని ఆహ్వానించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఢీ 14 గ్రాండ్ ఫినాలేలో రాబోయే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో లేటెస్ట్‌గా రిలీజ్ అయ్యింది. ఈ గ్రాండ్ ఫినాలేకి వచ్చే ప్రముఖులు ఎవరా అని ఎదురుచూస్తున్న ఆడియెన్స్‌కి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘మాస్ మహారాజా’గా ప్రసిద్ధి చెందిన రవితేజని ఈ షో గ్రాండ్ ఫినాలేకి ఆహ్వానిస్తున్నారు.

ఇక రవితేజ కామెడీ టైమింగ్ పీక్స్ అని చెప్పొచ్చు. ఈ షో కంటెస్టెంట్స్ ఐనసోమేష్, మహాలక్ష్మి.. ఇంకా కొందరు ఈ సీజన్‌లో ఇప్పటికే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ట్రోఫీ ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.