English | Telugu

'సండే సెలబ్రిటీ డే' .. సూర్య చెప్పిన ఫ్లవర్స్? ఫైర్స్ ఎవరు? 

బిగ్ బాస్ హౌస్ రోజుకో ట్విస్ట్ లతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే నిన్నటి దాకా టాస్క్ లు ఆడిన హౌస్ మేట్స్, ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ లో ఉన్నవాళ్ళని సేవ్ చేయడం మొదలుపెట్టాడు నాగార్జున. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఏమో అని హౌస్ మేట్స్ షాక్ లో ఉన్నారు.

సండే ఫండే అంటు నాగార్జున సెలబ్రిటీ లను తీసుకొచ్చాడు. హీరోయిన్ 'ఫరియా అబ్దుల్లా', హీరో 'సంతోష్' స్టేజ్ మీదకి వచ్చారు. వీరిద్దరు కలిసి నటించిన మూవీ 'లైక్.. షేర్..కామెంట్..' మూవీ ట్రైలర్ బిగ్ బాస్ టీవిలో చూపించాడు నాగార్జున. ఆ తర్వాత ఫైరా, సంతోష్ తో కాసేపు కబుర్లు చెప్పాక , హౌస్ మేట్స్ ని సెలబ్రిటీలకు పరిచయం చేసాడు. ఇలా కాసేపటి తర్వాత గేమ్స్ జరిగాయి. ఆ గేమ్స్ లో నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇలా సాగిన ఆదివారం ఎపిసోడ్ కాస్త ఉత్కంఠభరితంగా సాగింది.

సూర్య శనివారం ఎలిమినేట్ అయ్యాడు.‌కానీ తన 'ఏవీ' ని చూపించలేదు. దీంతో హౌస్ మేట్స్, ప్రేక్షకులు సూర్యని సీక్రెట్ రూం లో ఉంచారేమో అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. సూర్యని మళ్ళీ స్జేజ్ మీదకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత నాగార్జున సూర్యతో మాట్లాడుతూ, " ఏంటి సూర్య ఎలా అనిపించింది హౌస్ లో, ఇప్పుడు బయటకెళ్తున్నావ్ కదా. నీ బుజ్జమ్మ ని కలుస్తావ్. ఇక ఫుల్ హ్యాపీ ఆ " అని నాగార్జున అడుగగా, "అదేం లేదు సర్. ఇన్ని రోజులు హౌస్ మేట్స్ తో చాలా మెమోరీస్ ఉన్నాయి. సో మిస్ అవుతాను. 'హార్ట్ లిటిల్ బిట్ వేట్ ' ఉంది అని సూర్య చెప్పాడు. ఆ తర్వాత సూర్య 'ఏవి'ని చూపించాడు నాగార్జున. అది చూసి ఎమోషనల్ అయ్యడు సూర్య. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో టీవిలో మాట్లాడించాడు నాగార్జున. మొదటగా 'ఐ మిస్ యూ సూర్య' అని ఇనయా అంది. ఆ తర్వాత హౌస్ లో ప్లవర్స్ ఎవరు? ఫైర్స్ ఎవరు అని నాగార్జున అడుగగా‌, " 'రేవంత్ ఫైర్ బ్రాండ్, అగ్రెసివ్, గేమ్ లాస్ అయిపోయినప్పుడు మాటలు జారకుండా చూసుకో ', 'గీతు పైర్, స్మార్ట్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అందరి చేత అడించాలనుకుంటావ్. నీ గేమ్ నువ్వు ఆడు', 'శ్రీహాన్ ఫైర్, కెప్టెన్సీ తర్వాత చిన్న చేంజ్ చూసాను. దానవల్ల కొంతమంది హర్ట్ అవుతున్నారు చూసుకో ', 'ఆదిత్య ఫైర్, గేమ్ ను గేమ్ లా చూడు. గేమ్ లో బీ అగ్రెసివ్ అన్న అని అనగా, ఐ మిస్ యూ ఏ లాట్' అని ఆదిత్య అన్నాడు. 'ఫైమా ఫ్లవర్ అనుకుంటున్నా' , ఫైమా గేమ్ వైజ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ తగ్గేదేలే" అని చెప్పుకొచ్చాడు.

సూర్య , ఇనయాతో 'వి నీడ్ ఫైర్' అని అనగా, 'నీ గేమ్ కూడా కలిపి నేనే ఆడుతాను. సూర్య బాగున్నావ్. నువ్వు ఎల్లో వేసుకుంటావ్ అని గెస్ చేసాను. మిస్ యూ సూర్య." అని ఇనయా చెప్పింది. ఆ తర్వాత టైం అయిపోయింది అని సూర్యని బయటకు పంపించేసాడు నాగార్జున. ఇలా ఆదివారం ఎపిసోడ్ ఎన్నో ట్విస్ట్ లతో ఆకట్టుకుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.