English | Telugu
డ్రగ్స్ కేసులో అషురెడ్డి.. అందుకేనా ఈ పవర్ ఫుల్ వార్నింగ్
Updated : Jun 24, 2023
అష్షురెడ్డి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంతే బోల్డ్ గా ఉంటుంది అలాగే ఆన్సర్స్ చేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వార్నింగ్ ఇచ్చేసింది.. టిక్ టాక్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆర్జీవీ అభిమాని...ఆమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో సూపర్ హాట్ ఫొటోస్ తో యూత్ ని మెస్మోరైజ్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తన హవా ఎప్పుడూ కొనసాగిస్తూ ఉంటుంది.
అలాంటి అష్షు ఈ మధ్య ఫారెన్ వెళ్లి రకరకాల స్టేజి షోస్ అవీ చేస్తోంది. వాటికి సంబందించిన ఫొటోస్ ని, వీడియోస్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అప్ లోడ్ చేస్తూ వస్తోంది. ఐతే అష్షు రీసెంట్ గా తన ఇన్స్టా స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "ఇది ఎవరికీ సంబంధించింది అంటే...కొంతమందితో నాకున్న ఫ్రెండ్ షిప్ కి సంబంధించి కొన్ని మీడియా వర్గాలు రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.. దాన్నితీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విషయంలో సంబంధిత వ్యక్తులకు నిజానిజాలు తెలియజేస్తాను. నా ఫోన్ నంబర్ ని బహిరంగంగా పోస్ట్ చేస్తే మాత్రం సహించేది లేదు" అంటూ ఒక వార్నింగ్ ఇచ్చేసింది. అష్షు ఈ మధ్య బుల్లితెర మీద ఎక్కడా కనిపించడం లేదు..ఐతే ఇప్పుడు ఇలాంటి ఒక వార్నింగ్ ఎందుకు పాస్ చేసిందా అని చూస్తే గనక డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈయన కాల్ లిస్ట్ ని డీకోడ్ చేసిన పోలీసులకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అషురెడ్డి పేరుతో పాటు ఇంకొంతమంది పేర్లు బయటకు తీసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.