English | Telugu

Jayam serial : గంగ జాతకంలో తన భర్తకి ప్రాణగండం.. బాబా మాటలతో కుటుంబమంతా షాక్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -175 లో... శకుంతలతో పాటు పెద్ద సారు, వీరు, ఇషిక, సూర్య, గంగ అందరు హాల్లో ఉంటారు. ఎందుకు మనం అంతా ఇప్పుడు ఇలా ఎదురుచూడటం ఎవరు ఈ బాబా అని శకుంతల అడుగుతుంది. ఎప్పటి నుండో మనం స్వామిని నమ్ముకున్నాం కదా కొత్తగా ఈ బాబా ఏంటని శకుంతల అడుగగా.. మంచి మహిమ గల బాబా అని మా అమ్మ చెప్పిందని గంగ అంటుంది. అదే ఎందుకు ఇప్పుడు అని అంటుంది. ఏ రాయిలో ఏ మహిమ ఉందోనని కనపడిన ప్రతీ దగ్గర మొక్కుకోవట్లేదా అని పెద్దసారు అంటాడు. అప్పుడే విభూది బాబా వస్తాడు.

మొదటగా పెద్దసారు, శకుంతల గురించి మాట్లాడతాడు బాబా. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం.. అయితే మీ మధ్య కొన్ని సమస్యలున్నాయని చెప్పగానే అవునని పెద్దసారు అంటాడు. గంగ, రుద్ర ప్రతాప్ ల గురించి చెప్పమని అడుగగా.. వారి జాతకం తీసుకురమ్మని చెప్తాడు బాబా. ఇద్దరి జాతక‌ం ఇచ్చాక అది చూసి షాక్ అవుతాడు బాబా. గంగ జాతకంలో భర్తకి ప్రాణగండం ఉంది. వారిద్దరి మధ్య కార్యం జరిగితే గంగ భర్త ప్రాణాలకే ప్రమాదం అని బాబా చెప్తాడు. దాంతో గంగతో పాటు ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నేను చెప్పానా.. నా మాట ఎవరు వినలేదు.. ఇప్పుడు చూసారా.. ఇప్పుడేమంటారంటూ పెద్దసారు మీద శకుంతల కోప్పడుతుంది.

మరి దీనికి పరిహారం లేదా బాబా అని పెద్దసారు అడుగగా.. మొదటగా గంగ, రుద్రలని కలవనీయకుండా దూరంగా ఉంచాలి.. ఆ తర్వాత మహా మృత్యుంజయ హోమం జరిపించాలి.. జపాలు, యాగాలు చేయాలి‌. అప్పుడే గ్రహా దోషం పోయి శాంతి కలుగుతుందని చెప్పి విభూది బాబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు బాబా చెప్పిన మాటలనే తల్చుకుంటూ గంగ ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక వీరు, ఇషిక ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇక గంగ ఇంటి నుండి దూరంగా వదిలివెళ్ళిపోవాలనుకుంటుంది. రుద్ర క్షేమం కోసం బాక్సింగ్ ని కూడా వదిలేసి వెళ్ళిపోతుంది గంగ. మరి రుద్ర తనని తీసుకొస్తాడా.. వీరు బెదిరించి బాబాతో అలా చెప్పించాడని రుద్ర, గంగ తెలుసుకుంటారా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.