English | Telugu
టేస్టీ తేజ ఏం మారలేదుగా.. టాటూ వేసుకోమన్న నాగార్జున!
Updated : Oct 7, 2024
టేస్ట్ తేజ గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చి ఎంటర్‌టైన్మెంట్ పరవాలేదనిపించాడు. మళ్ళీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున ఏవిని చూపించి తేజని పిలుస్తాడు. తేజ బిఫోర్ బిగ్ బాస్.. ఆఫ్టర్ బిగ్ బాస్ అని తన లైఫ్ చేంజింగ్ గురించి చెప్పుకొచ్చాడు.
అంతకు ముందు అన్ని రెస్టారెంట్ లలో ఫుడ్ వీడియోలు తీసేవాడిని.. ఇప్పుడు దాదాపు చాలా రెస్టారెంట్ లని ఓపిన్ చేయడానికి గెస్ట్ గా పిలిచారు.. అంతే కాకుండా ఇరవై టీ బ్రాంచెస్ ఓపెన్ చేసానని తేజ అనగానేమ. కంగ్రాట్స్ అంటు నాగార్జున విష్ చేసాడు.
ఆ తర్వాత తేజ అమ్మ గారు చేసిన పాయసం నాగార్జునకి టేస్ట్ చేపిస్తాడు తేజ. నేనొక సర్ ప్రైజ్ అంటూ శోభాశెట్టి మాట్లాడిన వీడియోని చూపిస్తాడు. నువ్వు చాలా బాగా ఆడాలి.. లాస్ట్ టైమ్ నువ్వు మీ అమ్మాగారిని బిగ్ బాస్ హౌస్ కీ తీసుకొని వెళ్ళలేదని ఫీల్ అయ్యావ్.. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందని అల్ ది బెస్ట్ అని శోభాశెట్టి చెప్తుంది. ఆ తర్వాత నీకు ఇంకొక సర్ ప్రైజ్ అంటూ గత సీజన్ లో తేజ చేతిపై శోభా శెట్టి పేరు వేయించుకోవాలని నాగార్జున చెప్తాడు. అప్పుడు డైవర్ట్ చేసాడు.. ఇప్పుడు టాటూ వేయించుకోమని నాగార్జున అనగానే.. వద్దు సర్ ఆవిడకి త్వరలోనే పెళ్లి తన పేరు నేను వేయించుకుంటే బాగోదని తేజా అంటాడు.
ఆ తర్వాత తేజకి బిర్యాని ఇచ్చి.. ఇది ఒక యష్మీ కీ మాత్రం షేర్ చెయ్ అని నాగార్జున అంటాడు. తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో సరదాగా మాట్లాడతాడు. బిర్యానీ మొదట అందరికి కొంచెం, కొంచెం టేస్ట్ చేయిస్తాడు. ఒక్క యష్మీకీ తప్ప.. అయితే నాకు బిర్యానీ అని యష్మీ అనగానే.. నువ్వు నన్ను ఇంప్రెస్ చెయ్యాలి. అది వీళ్ళందరు ఒకే అనాలి అప్పుడు బిర్యానీ మొత్తం నీకే అని టేస్టీ తేజ అనగానే.. యష్మీ ఇంప్రెస్ చేసి బిర్యానీ మొత్తం లాగించేస్తుంది. ఇక గత సీజన్ లో శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ లతో కలిసి ఆడిన తేజ.. ఈ సీజన్ ఎవరితో కలసి ఆడతాడో చూడాలి మరి.