English | Telugu

నూకరాజును కుక్క అన్న ఇంద్రజ...రాంప్రసాద్, భావన డాన్స్ రచ్చ


ఉగాది వెళ్లిందంటే శ్రీరామ నవమి వచ్చేస్తుంది. ఇక బుల్లితెర మీద ఆల్రెడీ శ్రీరామ నవమి సందర్భంగా ఈవెంట్ ప్రోమోస్ రిలీజ్ అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీరామనవమి ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో అంతా రామమయం ఐపోయింది. ప్రోమో స్టార్టింగ్ లో ఇంద్రజ చేతిలో ఉన్న కొబ్బరి చిప్పను కమెడియన్ బాబుకి ఇచ్చి పట్టుకోమని చెప్పి చీర సరి చేసుకుంటూ ఉంటుంది. ఇక బాబు ఆగలేక తినేసాడు. "బాబు అది ప్రసాదం కాదు ఏ కుక్కకు, కోతికో ఇవ్వమన్నారు" అని చెప్పింది ఇంద్రజ.

ఇంతలో ఇమ్మానుయేల్ వచ్చి "మీరేం కంగారు పడకుండా ఆల్రెడీ కోతి దగ్గరకే వెళ్ళింది అది" అంటూ బాబుని కోతిగా సంభోదించేసరికి "ఐతే కాస్త కుక్కకు కూడా ఇవ్వండి" అని కౌంటర్ వేసింది ఇంద్రజ. చివరిలో నూకరాజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఇంద్రజ దగ్గరకు. "ప్రతీ ఎపిసోడ్ కి ఒక్కో అమ్మాయిని తీసుకొచ్చి ఈవిడే నీ అత్తమ్మ" అని నాకు చూపిస్తున్నావు. తర్వాత ఇమ్మానుయేల్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి "అన్నయ్య ఐనా రోజుకో అమ్మాయిని తీసుకొస్తున్నాడు..నేను ఒకే అమ్మాయిని తెస్తున్నా" అని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇంద్రజకు కోపం వచ్చి ఇమ్మానుయేల్ ని సరదాగా కొట్టింది. తర్వాత ఆటో రామ్ ప్రసాద్, భావన వచ్చి "శుభసంకల్పం" మూవీలో "సీతమ్మ అందాలు" సాంగ్ కి డాన్స్ చేశారు. అలాగే ఇందులో ఒక గేమ్ సెగ్మెంట్ కూడా ఇచ్చారు. "రాముడు - సీత" అని చీటీల్లో రాసి ఒక బౌల్ లో వేసి అందరినీ తీసుకోమన్నారు. రాముడు ఎవరికి వస్తే వాళ్ళు సీతను కనిపెట్టాలి అనే టాస్క్ ఇచ్చింది రష్మీ. చిన్నప్పుడు ఈ ఆటను అందరం ఆడుకునే ఉంటాం. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ గేమ్ చూసేసరికి ఆడియన్స్ కి మంచిగా కనెక్ట్ ఐపోయింది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.