English | Telugu

త్వరలో జీ తెలుగులో సూపర్ క్వీన్ సీజన్ 2

సూపర్ క్వీన్ సీజన్ 2 త్వరలో జీ తెలుగులో ప్రసారం కావడానికి సిద్దమయ్యింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళల కోసమే ప్రత్యేకించి రూపొందిస్తున్న ఎన్నో షోస్ లో ఇది కూడా ఒకటి. జీవితంలో ఎదురయ్యే అవరోధాలు, అవమానాలు ఎన్ని ఉన్నా ఎంతమంది వెనకగా నవ్వుకున్నా వెనకడుగు వేయకుండా.. జీవితంలో సక్సెస్ తో బుద్ది చెప్పి ఆడియన్స్ మనస్సులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బుల్లితెర నటీమణులతో ‘సూపర్‌ క్వీన్‌’ అనే షో స్టార్ట్ అయ్యి సీజన్ 1 ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఇందులో పల్సర్ బైక్ కండక్టర్ ఝాన్సీ, నటి విద్యురామన్, మౌనిక యాదవ్, ప్రియాంక చౌదరి, యాంకర్ ప్రశాంతి, సుహాసిని, ఎస్తేర్, జబర్దస్త్ పవిత్ర, లిఖిత మూర్తి, అనాలా సుష్మిత..రాబోతున్నారు.

ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు. "నా ప్రయాణం నా కోసం కాదు...నా గమ్యం నాది కాదు, నేను అనే పదం తప్ప..నేను అనే నిజం తెలీదు, నా ఓటమి ఎదురుగా వేల మంది, నా గెలుపు వెనక నెన్నొక్కతిని, నా భయం నా ఓటమి ఎందరిని ఓడిస్తుందో అని, నా భాగ్యం నా గెలుపు ఎంత మందిని కుంగదీస్తుందో అని , నా నవ్వు కొందరిని బాధపెడుతోంది, నా బాధ ఎందరికో నవ్వునిస్తుంది, అందరూ ఉన్నా ఒంటరిని నేను..ఐనా నేను రాణిని నా జీవితానికి మహారాణిని" అంటూ యాంకర్ ఉదయభాను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చింది. "వాళ్ళ ఆవేదన సముద్రమంత లోతు..వాళ్ళ ఆప్యాయత కొండంత ఎత్తు... సివంగుల మధ్య సమరం ఆరంభం" అంటూ ఒక టాగ్ లైన్ ఇచ్చాడు ప్రదీప్...మరి ఈ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారో ఎవరు సూపర్ క్వీన్ అవార్డు ని అందుకుంటారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.