English | Telugu
పూర్తైన ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్...
Updated : Sep 1, 2023
ఇప్పటివరకు ఎంతో అలరించిన "ఇంటికి దీపం ఇల్లాలు" సీరియల్ ఇప్పుడు పూర్తయిపోయింది. ఇక ఫైనల్ డే షూటింగ్ చాలా సందడిగా సాగింది. ఇక సెట్ లో ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యుట్యూబ్స్ కోసం వీడియోస్ షూట్ చేసుకున్నారు. ఇక నీమా సింగ్ చాల ఫీలయ్యింది. "సీరియల్ ఐపోతోంది అనే ఒక రకమైన తెలియని బాధగా ఉంది" అని చెప్పడంతో శివ కుమార్ వచ్చి "ఎందుకంటే నీమా సింగ్ నన్ను చాలా మిస్ అవుతుంది..అందుకే బాధపడుతోంది " అని చెప్పాడు.
"నిన్ను మిస్ అవుతున్నానా..నీతో రెండు సీరియల్స్ చేసేసరికి తలనొప్పి వచ్చింది నాకు పో" అని ఫన్నీగా కసురుకుంది. ఇక షూటింగ్ లో సన ఎలా ఉంటారో కూడా శివ కుమార్ చెప్పాడు. రోజూ సన తినడానికి ఏదో ఒకటి సెట్ మొత్తానికి ఇస్తారని చాలా మంచి మనసు ఉన్న అమ్మ అని కితాబిచ్చాడు. ఇక రెండున్నరేళ్లు ఎలా కలిసిపోయామో మాకే తెలీదు...సడెన్ గా సీరియల్ ని ఆపేసారు అనే చెప్పారు ఈ సీరియల్ టీమ్. .ఇక నెటిజన్స్ కూడా ఈ సీరియల్ ఐపోవడంతో చాలా నిరాశలో ఉన్నారు. ఐతే కొంతమంది నెటిజన్స్ మాత్రం డబ్బింగ్ సీరియల్స్ కి పెద్దగా ఆదరణ ఉండదు..ఇలా త్వరగా ముగిసిపోతాయి అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్ టీమ్ అంత కలిసి డిన్నర్ చేసి కాసేపు చిట్ చాట్ చేసుకుని ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. సన కూడా ఈ సీరియల్ ఎండింగ్ షూటింగ్ ని వీడియో తీసి తన యుట్యూబ్ లో అప్ లోడ్ చేసుకున్నారు. ఇక నెటిజన్స్ సీరియల్ ఐపోయినందుకు చాలా బాధపడుతున్నారు.