English | Telugu

రాజీవ్ వచ్చి అలా నిలబడితే సుమ అంత కసిగా ముద్దు పెట్టేస్తుందట

సుమ ఎం చేసినా ఎలాంటి డైలాగ్స్ వేసినా ఫుల్ కామెడీగా ఉంటుంది. సుమ అడ్డా షోకి ఎవరొచ్చినా బాగా నవ్విస్తుంది. రీసెంట్ గా సుమ అడ్డా షోకు.. భజే వాయువేగం మూవీ టీం వచ్చింది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు దర్శక, నిర్మాతలు కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి సినిమాను ప్రమోట్ చేస్తూనే గేమ్స్ ఆడింది సుమ. అలాగే విపరీతమైన పంచులు వేసింది. ఇందులో ఒక గేమ్ షోలో మనసులో ఏం ఉందో అని చూపించే ఒక బౌల్ ని తీసుకొచ్చింది. దాని మీద చేతులు పెట్టమని కళ్ళు మూసుకుంటే మనసులో ఉన్న ఇమేజ్ ఎదురుగా స్క్రీన్ మీద కనబడుతుంది. అయితే ముందుగా దీనిపై నరసింహ చేయి పెట్టించింది .. ఫస్ట్ నైట్ డెకరేషన్ రూంను చూపించారు. దాన్ని చూసిన నరసింహ ఇదెక్కడ ఉందో చెబితే వెళ్తాను అని అడిగాడు. దానికి అందరూ నవ్వేశారు.

ఇక ఆ తర్వాత భజే వాయు వేగం మూవీ హీరో కార్తికేయ చేయి పెట్టాడు. దాంతో బోల్డు మంది అమ్మాయిల బొమ్మలు కనిపించాయి. చివరికి ఇదే గేమ్ ని సుమతో ఆడించాడు కార్తికేయ. అలా సుమ చేయి పెట్టగానే.. తన కొడుకు రోషన్ కనకాల హీరోగా చేసిన బబుల్ గమ్ సినిమా పోస్టర్ కనిపించింది. అందులో హీరోయిన్ హీరో చెంపను కొరికేస్తూ ఉన్న పిక్ అయ్యేసరికి సుమ షాకైపోయింది. అయితే అప్పటికప్పుడు రాజీవ్ కనకాలను చూడగానే అలాగే చేస్తారన్నమాట అని చెప్పేసరికి సుమ తెగ సిగ్గుపిడపోతూ కాదని చేయి ఊపింది. ఇక్క అక్కడ అందరూ నవ్వేశారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.