Read more!

English | Telugu

30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను!

సుమ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు..అలాంటి సుమ మూవీ ప్రొమోషన్స్ మాత్రమే కాదు కాలేజీ స్టూడెంట్స్ కూడా చిట్ చాట్ చేస్తూ వెరైటీ అండ్ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చి నవ్వించింది. ఎక్కడ అంటే మద్రాస్ ఐఐటి కాలేజీలో. రీసెంట్ గా ఆమె ఆ కాలేజీ క్యాంపస్ కి వెళ్ళింది. అక్కడ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా జవాబులు ఇచ్చింది. "క్యాంపస్ లోకి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి " అని అడిగేసరికి "మన ఊరిలో మేకలు తిరిగినట్టు ఇక్కడ జింకలు తిరుగుతున్నాయి. మన ఊరిలో కూకలు తిరిగినట్టు ఇక్కడ కోతులు తిరుగుతున్నాయి. ఇది కాలేజా, అడవా అన్నట్టుగా ఉంది. ఇంత ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ క్యాంపస్ లో చదువు విషయం ఏమో కానీ రొమాన్స్ బాగా జరుగుతుందేమో అన్నట్టుగా ఉంది. 

ఇంకా నేను పుట్టింది పాలక్కాడ్ లో నా 15 ఇయర్స్ ఏజ్ లో యాంకరింగ్ లోకి వచ్చాను. అప్పుడు మా అమ్మ తెలుగు నేర్చుకుని మాకు తెలుగు నేర్పి ఇక్కడికి పంపించింది. జీవితం అంటేనే పెద్ద ఛాలెంజ్, పోయేవరకు ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది. నాకు పేరు రావాలి రావాలి అంటే రాదు. ఏం చేయాలి అనుకుంటున్నామో అది కరెక్ట్ గా చేసినప్పుడే పేరు వస్తుంది. నా ఏజ్ కి నాకు క్లారిటీ లేనే లేదు..ఎందుకంటే నేను ఇంటర్ లో బైపీసీ చేశా డిగ్రీలో బీకామ్ చేసి తర్వాత ఎంకామ్ చేశా. ముందు అకౌంట్స్ సెక్షన్ లోకి వెల్దామనుకున్న తర్వాత టీచర్ అవుదామనుకున్న తర్వాత ఏదో అలా అలా చేస్తూ చేస్తూ వెళ్తే దానికి యాంకర్ అని పేరు వచ్చింది. 

"ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్" అనే సంస్థ నా డ్రీం..ఎందుకంటే నన్ను ఇష్టపడి ఇంత దాన్ని చేసిన ఆడియన్స్ కి నేను కూడా ఎంతో కొంత చేయాలి అనుకున్నా. లేదంటే వయిపోతానేమో అని భయం వేసింది. నాకు వచ్చేదాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలని ఇది స్టార్ట్ చేసాను... 30  మంది స్టూడెంట్స్ ని  అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యేవరకు నేను వాళ్ళతోనే ఉంటాను. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐఏ సంస్థ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యారు అలాగే జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు." అని చెప్పింది సుమా..ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.