English | Telugu

'నాన్న ఉన్నా, చనిపోయాడని చెప్తాను' అంటూ ఎమోష‌న‌ల్ అయిన‌ మెరీనా!

హౌస్‌లో పదకొండో రోజు "సిసింద్రీ టాస్క్ లో అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. అందుకని ఒక్కొక్కరుగా వచ్చి మీ జీవితంలో బేబి ఉన్నారా? ఉంటే వారితో ఎలా ఉండేది మీ అనుబంధం వివరించండి అని బిగ్ బాస్ చెప్పాడు. కెప్టెన్ గా ఉన్న ఆదిత్య ఒక్కొక్కరి పేరు పిలవ‌గా, వారు వచ్చి త‌మ అనుభ‌వాలు పంచుకున్నారు.

మెరీనా-రోహిత్ త‌మ‌ గురించి చెప్పడానికి వచ్చారు. మెరీనా మాట్లాడుతూ, "మా నాన్న ఉన్నాడు. కానీ ఎవరు అడిగినా చనిపోయాడు అని చెప్తాను. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుండి రాలేదు. ఎప్పుడూ అమ్మని కొడుతుండేవాడు. మా అమ్మని నాన్న గది లోపల కొడుతూ ఉంటే బయట నేను ఏడుస్తూ ఉండేదాన్ని. ఓదార్చ‌డానికి ఎవరూ ఉండేవారు కాదు. నాన్న ప్రేమ తెలియదు. కానీ పెళ్ళితో రోహిత్ నాకు ఎవరూ లేరు అనే లోటును తీర్చాడు. బాగా చూసుకుంటున్నాడు. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. నాల్గవ నెల న‌డుస్తుండ‌గా హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తే హార్ట్‌ బీట్ లేదు. బేబీని తీసేయాలని డాక్టర్ లు చెప్పారు. నేను ఒప్పుకోలేదు. కానీ తప్పలేదు. చాలా ఏడ్చాను. రోహిత్ ఎంత‌గానో ఓదార్చాడు" అని చెప్పుకొచ్చింది.

దీంతో హౌస్ లోని ఉన్న అందరూ ఎమోషనల్ అయ్యారు. తర్వాత అభినయశ్రీ, 'One day you will get baby' అని చెప్పింది మెరీనాతో. తర్వాత వంతు చంటిది.

అత‌ను మాట్లాడుతూ, "నాకు ఇద్దరు కూతుళ్లు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నా కళ్ళ ముందే మా అమ్మ మంటల్లో కాలి చనిపోయింది.ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు నాకు పాప పుట్టింది. పాపను చూడగానే పట్టరాని సంతోషం. కంటి నిండా కన్నీరు. హాస్పిటల్ బయటకు వెళ్ళి ఒక టీ షాప్ దగ్గర నిల్చోని మా అమ్మే వచ్చిందని ఒక గంట సేపు ఏడ్చాను. తర్వాత మరో పాప పుట్టింది. ఇప్పుడు రోజూ వాళ్ళు స్కూల్ కి వెళ్ళాక నేను లేస్తాను. వాళ్ళు పడుకున్నాక నేను ఇంటికి వస్తాను. ఆ దేవుడు మా అమ్మను ఇద్దరిగా పుట్టించాడు. పిల్లలని కనే తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నా.. అడుక్కు తినండి కానీ పిల్లల్ని రోడ్ల మీద వదిలేయకండి ప్లీజ్ "అని చెప్పి వెళ్ళిపోయాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.