English | Telugu

గెలుపుని తీసుకున్నప్పుడు ఓటమిని కూడా తీసుకోవాలి: శ్రీసత్య

బిగ్ బాస్హౌస్ లో రోజు రోజుకి అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఎందుకంటే వారాలు గడిచేకొద్దీ హౌస్ మేట్స్ ప్రవర్తన చేంజ్ అవుతూ వస్తోంది. 'టికెట్ టు ఫినాలే' రేస్ లో అందరూ కూడా వారి బెస్ట్ ఇస్తున్నారు.

ఒక్కో లెవల్ పూర్తయ్యే కొద్ది రేస్ నుంచిఒక్కో కంటెస్టెంట్ బయటకొస్తున్నారు. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఇద్దరు బయటకొచ్చారు. మిగతా నలుగురు రేస్ లో ముందుకెళ్ళారు. అయితే వారికి బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా, ఆ టాస్క్ లో మొదటగా ఫైమా వెళ్ళిపోగా, తర్వాత రేవంత్, శ్రీహాన్ లు వెళ్ళిపోయారు. చివరగా ఆదిరెడ్డి ఉన్నాడు.

రేవంత్ టాస్క్ నుండి వెళ్లిపోతూ "నా శాడిస్టిక్ చూపిస్తా" అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న శ్రీసత్య, రేవంత్ దగ్గరికి వెళ్ళి"ఏంటి రేవంత్ ఎందుకలా అంటున్నావ్, టాస్క్ లో అందరూ ఫన్నీ గానే కదా జోక్స్ వేసుకున్నారు. గెలుపుని తీసుకున్నప్పుడు.. ఓటమిని కూడా తీసుకోవాలి" అంటూ చెప్పింది. "నాకు తెలుసులే.. నువ్వు వెళ్ళు" అని రేవంత్ అన్నాడు. అయితే రేవంత్ తో ఇంతకముందు ఇదేమాట ఆదిరెడ్డి కూడా చెప్పాడు. అయితే రేవంత్ తనకి ఫేవర్ గా ఉండి గెలిస్తే కామ్ గా ఉంటాడు. తను గెలవకపోతే కోపాన్ని చూపిస్తాడా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.