English | Telugu

శ్రీసత్యకి ఎలిమినేషన్ తప్పదా!


బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి సస్పెన్స్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ప్రతీ వారం ఎలిమినేషన్ అనేది కామన్ గా జరిగేదే. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పేలా లేదు. ఎందుకంటే ఫైనల్ కి ఇంకా మిగిలింది ఒక్క వారమే.. కాబట్టి ఈ వారం కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంటుందని వీక్షకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ వారం ఎలిమినేషన్ కేటగిరీ చూసుకుంటే అందరికన్నా చివరగా శ్రీసత్య ఉంది. దీంతో తనకి ఎలిమినేషన్ ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ వారం అంతా శ్రీసత్య పర్ఫామెన్స్ చూసుకుంటే పర్వాలేదనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి నుండి జరిగిన టాస్క్ లలో తనే విజేతగా నిలిచింది. అయితే శ్రీసత్యకి హౌస్ లో ఎవరి మద్దతు లేకపోవడంతో.. తను సింగిల్ గా పర్ఫామెన్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

ఫ్యామీలి వీక్ ముందు వరకూ శ్రీసత్య మీద చిరాకుగా ఉన్న ప్రేక్షకులు, ఫ్యామిలీ వీక్ లో శ్రీసత్య పేరెంట్స్ ని చూసి కనెక్ట్ అయ్యారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఓటింగ్ లో శ్రీసత్య గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇదే కాకుండా ఈ మధ్య తను హౌస్ లో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకపోవడం ఒకటి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ ని బట్టి తనే చివరి స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చివరికి వరకు ఉండే సస్పెన్స్ రివీల్ అవ్వాలంటే ఇంకో రోజు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.