English | Telugu

జగపతి బాబుతో స్టెప్పులేసిన  శ్రీలీల!

జీ తెలుగులో రీసెంట్ గా స్టార్ట్ ఐన టాక్ షో "జయమ్ము నిశ్చయమ్మురా". ఈ షోకి ప్రతీ వారం ఒక గెస్ట్ ని తీసుకొస్తున్నారు. హోస్ట్ గా జగపతి బాబు చేస్తున్నారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ కి నాగార్జునని ఇంటర్వ్యూ చేశారు. ఆయనకు సంబందించిన ఎన్నో ఓల్డ్ పిక్స్ ని ఆయనకు కూడా తెలియనివి కూడా చూపించి ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి శ్రీలీల రాబోతోంది. దానికి సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో లాస్ట్ లో జగపతి బాబు శ్రీలీలతో కలిసి స్టెప్పులేశారు. ఈమె షోలోకి ఎంట్రీ ఇవ్వగానే "చందమామలా ఉన్నావమ్మా" అంటూ పొగిడేశారు. "అసలు నీకు ఎన్ని భాషలు వచ్చు అని అడిగారు" "మలయాళం ఒక్కటి కొంచెం నేర్చుకోవాలి" అని చెప్పింది శ్రీలీల. "ఏదీ వదలవా నువ్వు ఉన్న హీరోయిన్స్ ని కూడా లేపేసి నువ్వు దూరిపోయావ్" అని పెద్ద అభాండం వేశారు జగపతి బాబు. "నేను రాలేదు సర్" అంటూ శ్రీలీల దణ్ణం పెట్టేసింది.

"ఒక పరీక్ష పెడతాను ఎంతబాగా వచ్చో చూద్దాం" అనేసరికి "మళ్ళీ మా కాలేజ్ లో వైవా పరీక్షలో ఉన్నట్టుగా ఉంది" అని చెప్పింది. "మూవీస్ లో ఫేక్ బ్లడ్ పెట్టుకుంటాం కదా అప్పుడు నర్సులు వాళ్ళు నన్ను చూసి నిజంగా రక్తం వస్తోందా అని భయపడిపోయారు" అంటూ నవ్వుతూ చెప్పింది శ్రీలీల. "ఇంకా ఎన్ని చూడాలో నీ లీలలు..ఇంకా చాలా ఉన్నాయమ్మా వెయిట్ చెయ్" అన్నారు జగపతి బాబు. కొన్ని పిక్స్ ని చూసి చాలా షాకైపోయి గట్టిగా సరిచేసి ..నా వల్ల కాదు సర్" అనేసింది. "నువ్వు మాట్లాడ్డం కూడా డాన్స్ లే చేసేస్తున్నావ్" అన్నారు జగ్గు భాయ్. తర్వాత మ్యూజిక్ అని చెప్పి లేచి మరీ "మనసా పలకవే" డాన్స్ చేసేసింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.