English | Telugu

అందుకే 'మగధీర' ఆఫర్ వదులుకున్నా!

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో నటించే అవకాశమొస్తే స్టార్స్ సైతం ఎగిరిగంతేస్తారు. ఎందరో స్టార్స్ ఆయన సినిమాల్లో చిన్న రోల్స్ చేయడానికి కూడా వెనకాడరు. కానీ నటి అర్చన మాత్రం ఆయన దర్శకత్వంలో వహించిన 'మగధీర'లో నటించే అవకాశమొస్తే వదులుకున్నారట.

ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో తన భర్త జగదీష్ తో కలిసి అర్చన పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ 'మగధీర' అవకాశం వదులుకోవడానికి ఓ రకంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' కారణమని చెప్పారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో త్రిష ఫ్రెండ్ గా అర్చన నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అదే సమయంలో బాపు దర్శకత్వంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పోగొట్టింది. బాపు డైరెక్ట్ చేసిన 'రాధా గోపాళం'లో హీరోయిన్ గా నటించే అవకాశం మొదట అర్చనకు వచ్చిందట. అయితే అదే సమయంలో ఆమె 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటిస్తుందని తెలిసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిందంటూ 'రాధా గోపాళం' నుంచి ఆమెను తీసేశారట. దానిని దృష్టిలో పెట్టుకునే అర్చన మగధీరకు నో చెప్పారట.

'మగధీర'లో సలోని పోషించిన పాత్ర కోసం ముందుగా అర్చనను సంప్రదించారట. అయితే ఇలాంటి చిన్న పాత్రలు చేస్తే, 'రాధా గోపాళం' విషయంలో జరిగినట్లుగా పెద్ద అవకాశాలు రావేమోనన్న భయంతో ఆమె చేయలేదట. కానీ 'మగధీర'లో చిన్న రోల్ లో మెరిసిన సలోనికి రాజమౌళి తన తదుపరి సినిమా 'మర్యాద రామన్న'లో హీరోయిన్ గా అవకాశమిచ్చారు. ఒకవేళ తాను 'మగధీర'లో నటించి ఉంటే.. 'మర్యాద రామన్న'లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చేదేమో అంటూ అర్చన చెప్పుకొచ్చారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.