English | Telugu

ప్రభుదేవా ఫోన్ చేసి మెచ్చుకున్నారు...క్రెడిట్స్ కింద కొరియోగ్రాఫర్ పేరు ఉండదు

బుల్లితెర మీద డాన్స్ షోస్ కి ఎక్కువగా శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వస్తూ ఉంటారు. ఆయన టాలీవుడ్ లో ఎన్నో సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. "కొరియోగ్రఫీ విషయంలో నాకు ఒకటి బాధ కలిగిస్తుంది. ఇంత కష్టపడి చేస్తే కొరియోగ్రాఫ్ చేస్తే ఒక డాన్స్ కి యూట్యూబ్ లో కానీ ఇంకెక్కడైనా కూడా క్రెడిట్స్ కింద కొరియోగ్రాఫర్ పేరు ఉండదు. అక్కడ చాలా బాధేస్తుంది. సాంగ్ రిలీజ్ చేసాక మ్యూజిక్ డైరెక్టర్ ది, పాడిన వాళ్ళ పేర్లు, రచయిత పేరు కూడా వేస్తారు కానీ కొరియోగ్రాఫర్ పేరు మాత్రం వేయరు. ఐతే కొందరు మర్చిపోతారేమో.. అదొక్క విషయంలోనే బాధగా ఉంటుంది.

మనం ఒక పని చేసాక క్రెడిట్స్ తీసుకోవాలి. కొరియోగ్రాఫ్ చేసినందుకు డబ్బు మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కానీ టెక్నీషియన్స్ కి ఆ క్రెడిట్స్ అలాగే బాగా చేస్తే ఒక ఫోన్ చేసి బాగా చేశారు అని చెప్పే మాట ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అలా చెప్తే ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఆ క్రెడిట్స్. ప్రభుదేవా గారి నుంచి నాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆయన ఉన్నారు కాబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు ఆయన డాన్స్ అంటే ఇష్టం. నేను ఆయన దగ్గర వర్క్ కూడా చేయలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో ఎం చేయాలో తెలీక అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ కనిపించింది. ఈ హాలిడేస్ లో ఎం చేస్తాం డాన్స్ నేర్చుకుందాం అనుకున్నా..అలా అక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు మస్తాన్ మాష్టర్ ఉన్నారు. ఏ డాన్స్ స్టైల్ కావాలి అన్నారు. ప్రభుదేవా మాష్టర్ చేసే డాన్స్ స్టైల్ అన్నాను. ఆయన సాంగ్స్ ఆయన మూవ్మెంట్స్ చూసి ఇంటికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడిని. "టాపు లేచిపోద్ది" సాంగ్ చూసి ప్రభు మాష్టర్ వేరే వాళ్ళ దగ్గర నా నంబర్ తీసుకుని ఫోన్ చేసి చాలా చాలా బాగుంది అన్నారు. నేను ఆయన మాట్లాడేసరికి ఇదంతా నిజమా అని నేను నమ్మలేకపోయా. తర్వాత "యాక్షన్ జాక్ సన్" మూవీకి కొరియోగ్రాఫ్ చేయాలి అంటే ఆస్ట్రేలియా వెళ్లి రెండు సాంగ్స్ చేశా." అని చెప్పాడు శేఖర్ మాస్టర్.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.