English | Telugu

వాళ్ళు బాగుంటే చాలు  నేను చచ్చిపోయినా పర్లేదు..

బుల్లితెర మీద ట్రాన్స్ జెండర్ కమెడియన్ తన్మయి గురించి అందరికీ తెలుసు. క్యూట్ గా మంచి కామెడీ టైమింగ్ తో ఫుల్ జోష్ అండ్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఐతే ఆమె జీవితంలోని కష్టాలు వింటే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.. ఒక ఇంటర్వ్యూలో ఆమె చాలా ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది "మూవీ ఆఫర్స్ వస్తున్నాయి కానీ డేట్స్ చెప్తాము అంటున్నారు కానీ తర్వాత పట్టించుకోవడం లేదు. నేను ఒక ఛాన్స్ వచ్చింది అని పరిగెత్తను, రాలేదు అని డల్ ఇపోను. నా లైఫ్ లో నాకు కొత్త ఆశలు అంటూ ఏమీ లేవు..నా ఫామిలీని చూసుకోవాలి అంతే..వాళ్ళు బాగున్నారా అది చాలు నాకు..వాళ్ళు బాగుంటే చాలు నేను చచ్చిపోయినా పర్లేదు.వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే.. ఈవెంట్స్ చేస్తున్నాను , జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను.

చాలు నాకు. సినిమాలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. నా లైఫ్ లో చాలా మలుపులు ఉన్నాయి. నేను మంచి స్టూడెంట్ ని. బైపీసీ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిలనే ఉండడం ఇష్టం. మా ఇంట్లో కూడా అందరికీ తెలుసు. ఇంటర్, డిగ్రీ చదివాను..మా ఇంటి వెనకే మా కాలేజ్. ఐతే అందులో బైపీసీ లేదు. చదివించే స్తొమత మా వాళ్లకు లేదు. అందుకే ఆర్కెస్ట్రాస్ లో డాన్సర్ గా వెళ్లేదాన్ని. 500 , 1000 , 1500 అలా ఇచ్చేవాళ్ళు. ముందు మాది పూరిల్లు, తర్వాత పెంకుటిల్లు, సంపాదించడం మొదలయ్యాక రేకుల ఇల్లు కట్టుకున్నాను. షోస్ లో వచ్చే డబ్బులతో చిట్టీలు వేసుకుని గుంటూరు లో ఒక మూడు ఫ్లోర్స్ తో ఉన్న ఒక మంచి ఇల్లును గుంటూరులో కట్టుకున్నాను. మా నాన్న డ్రింక్ చేసేవాడు, అమ్మ పొలం పనులకు వెళ్ళేది, నేను చినిగిపోయిన బట్టలతోనే స్కూల్ కి వెళ్లేదాన్ని. ఐతే ఇప్పుడు అందరినీ సెట్ చేసాను. నాకు పూర్తి అమ్మాయిగా ఉండడం అంటే ఇష్టం అందుకే మూడు సర్జరీలు చేయించుకుని చచ్చి బతికాను. బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఎవరెవరో ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. జాకెట్ పట్టుకుని లాగేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాను. అతను నా డబ్బు కావాలనుకున్నాడు కానీ నన్ను కాదు. " అంటూ తన్మయ్ తన జీవితంలోని ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.