English | Telugu

Tanuja Vs Sanjana: సంజన వర్సెస్‌ తనూజ.. ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్!

బిగ్ బాస్ సీజన్-9 పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్ లో నుండి గతవాతం రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది.

ఇక ఈ వారం ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.‌ అలాగే సెకెండ్ ఫైనలిస్ట్ ఎవరో తెలియడం కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ‌ఇక నిన్నటి ఎపిసోడ్ లో లోడర్ బోర్డ్ లో సంజన లీస్ట్ లో ఉండగా ఇమ్మాన్యుయేల్ టాప్ లో ఉన్నాడు. హౌస్ లో జరిగిన గేమ్ లో ఇమ్మాన్యుయేల్ ఫస్ట్ గెలిచి అత్యధికంగా 150 పాయింట్లు తెచ్చుకున్నాడు. ఇక ఇమ్మాన్యుయేల్ తర్వాత డీమాన్ పవన్ గెలిచాడు. అతనికి 120 పాయింట్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సుమన్ శెట్టి, తనూజ 90 పాయింట్లు వచ్చాయి. భరణికి 90 పాయింట్లు రాగా ఇక చివరగా ఉన్న సంజనకి ఎనభై పాయింట్లు వచ్చాయి. ఇక వీరిలో నుండి ఒకరిని తీసేయమని బిగ్ బాస్ కోరాడు. అక్కడ మొదలైంది అసలైన పంచాయతీ..‌ సంజన వర్సెస్ తనూజ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ‌

హౌస్ లో నెక్స్ట్ గేమ్ ఎవరు ఆడకూడదని అనుకుంటున్నారో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. మొదటగా సుమన్ శెట్టి లేచి.. అత్యధిక పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇమ్మాన్యుయేల్ ని తీసేద్దామని అనుకుంటున్నానని సుమన్ శెట్టి చెప్పగా, భరణి కూడా అదే రీజన్ చెప్పి ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పాడు. ఇక సంజన లేచి.‌ డీమాన్, ఇమ్మాన్యుయేల్ లో డీమాన్ స్ట్రాంగ్ కాబట్టి డీమాన్ ని తీసేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత తనూజ లేచి ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పింది. ఇక డీమాన్ లేచి సంజన పేరు చెప్పాడు.. కళ్యాణ్ కూడా సంజన పేరు చెప్పాడు. ఇక ఇప్పుడు హౌస్ లో‌ మిగిలింది ఇమ్మాన్యుయేల్. తను ఆడాలనుకుంటే సంజనని తీసేయ్యాలి లేదంటే తను డ్రాప్ అవ్వాలి. వేరే ఆప్షన్ లేదని ఇమ్మాన్యుయేల్ అనగానే.. ఇక వెంటనే సంజన నిల్చొని.. సారీ బిగ్ బాస్ నేను ఇమ్మాన్యుయేల్ ని తీసేద్దామని అనుకుంటున్నానని అంది. ఇక అది విని తనూజకి ఫుల్ కోపం వచ్చింది. తను లేచి సారీ బిగ్ బాస్.. నేను సంజనని గేమ్ నుండి తప్పించాలని అనుకుంటున్నానని చెప్పింది. దాంతో ఇద్దరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.