English | Telugu

బిగ్ బాస్ 9 కి రీతూ చౌదరి.. అందుకేనా ఈ శారీ అందాలు!

రీతూ చౌదరి బుల్లితెర మీదే కాదు సోషల్ మీడియాని హీట్ పుట్టించడంలో కూడా ముందుంటుంది. జబర్దస్త్‌తో పేరు తెచ్చుకున్న లేడీ కమెడియన్స్ లిస్టులో రీతూ కూడా ఒకటి. జబర్దస్త్‌ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది. తర్వాత కవర్ సాంగ్స్ చేసింది. సోషల్ మీడియాలో అందాలతో రచ్చ అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. అలాగే యాంకర్ గా కూడా రీతుకి మంచి పేరుంది. రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవుతూనే ఉంటాయి. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో కలిసి చేసిన స్కిట్స్, కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఐతే ఈ మధ్య కాలంలో రీతూ ఇంకా అందాల జాతరతో ఆడియన్స్ మనసులను కొల్లగొడుతోంది. ఐతే ఇదంతా బిగ్ బాస్ కోసమేనేమో అంటూ కొంతమంది అంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో... ఎంతగా, ఎవరు హైప్ అవుతారో, ఎంతలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారో అలాంటి వాళ్లకు బిగ్ బాస్ రెడ్ కార్పెట్ వేస్తుందని మనకి తెలుసు.

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 మరో వారంలో పూర్తి కాబోతోంది. ఈ సీజన్ కి నిజానికి రీతూ చౌదరిని తీసుకుంటారు అనుకున్నారు కానీ బాడ్ లక్ ఆమెకు అవకాశం రాలేదు. ఐతే ఇప్పుడు అందాల డోస్ పెంచడంతో పాటు రకరకాల ఫోజుల్లో కనిపిస్తోంది..రకరకాల చీరలు , డ్రెస్సుల్లో వీడియో షూట్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. ఇక ఈమె వీడియో పోస్ట్ చేసిందంటే చాలు ఫైర్ ఎమోజిస్ తప్ప వేరే ఏవీ కనిపించవు. ఇక ఇప్పుడు అలాంటి శారీ వీడియో పెట్టి కళ్ళజోడు పెట్టి మరీ ఫోజిచ్చేసరికి ఒక నెటిజన్ "నువ్వు బిగ్ బాస్ 9 కి కచ్చితంగా వెళ్తావు...అంటే ఇంకో నెటిజన్ ఐతే హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎలాగో రీతూ మంచి కంటెంట్ ఇస్తుంది కాబట్టి రాబోయే బిగ్ బాస్ 9 లో తీసుకుంటారేమో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.