English | Telugu

రిషి, వసుధార పెళ్లి గోల! స్టూడెంట్స్ పోల్ లో ఎవరు గెలవనున్నారు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-729లో.. కాలేజ్ లోని లైబ్రరీలో జయచంద్ర ఉండగా జగతి వచ్చి మాట్లాడుతుంది. రిషి తన కొడుకని, వసుధార-రిషి ప్రేమించుకున్నారని, అనుకోని పరిస్థితుల్లో వసుధార తన మెడలో తాళి వేసుకుందని జరిగిందంతా జయచంద్రకి అర్థం అయ్యేలా చెప్తుంది.

వారిద్దరికి అర్థం అయ్యేలా ఈ సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలని జయచంద్రతో జగతి చెప్పడంతో... సరే అలాగే చేస్తానని జయచంద్ర చెప్తాడు.‌ ఇక మోటివేషనల్ స్పీచ్ మొదలవుతుంది. ఏదైనా ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడదామని స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. మీరే ఏదైనా టాపిక్ చెప్పండని జయచంద్ర స్టూడెంట్స్ ని అడగగా.. కొందరు పాలిటిక్స్, మరికొందరు వేరే వేరే టాపిక్స్ గురించి చెప్పగా అవన్నీ మనం ప్రతీరోజు న్యూస్ లో, పేపర్లో చూస్తామని చెప్తాడు. ఆ తర్వాత జయచంద్రనే ఒక టాపిక్ గురించి చెప్పమంటారు స్టూడెంట్స్. దాంతో భారతీయ వివాహ బంధం గురించి స్పీచ్ ఇస్తుంటాడు జయచంద్ర. భారతీయ వివాహ బంధం చాలా గొప్పదని, దీనిని విదేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, ఇప్పుడిప్పుడే అక్కడ మన భారతీయ పద్దతిలో వివాహాలు జరుగుతున్నాయని, ఇందులో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు ఉంటాయని జయచంద్ర వివరిస్తాడు. అయితే ఈ స్పీచ్ వింటున్న రిషి తన పక్కనే ఉన్న వసుధారతో.. "విన్నావా వసుధార.. ఆ ఎనిమిది రకాలలో ఏ ఒక్కటి అయినా జరిగిందా.. నువ్వు తాళి వేసుకుంటే అది పెళ్ళి కాదు" అని చెప్తాడు. దాంతో ఉద్వేగంతో సోఫాలో కూర్చున్న వసుధార పైకి లేచి.. సర్ ఎనిమిది రకాల వివాహాలే కాదు సర్.. తొమ్మిదవ రకం ఉంది. అదే ఆపత్కాల వివాహమని వసుధార చెప్పగా.. ఏం మాట్లాడాలన్నా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని జయచంద్ర చెప్తాడు.

తను బాగా ఇష్డపడిన వ్యక్తిని ఊహించుకొని తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తన మెడలో తాళి వేసుకుంటే అది అపత్కాల వివాహమని వసుధార చెప్పగా.. నాకొక డౌట్ ఉందని రిషి అంటాడు. తనని స్టేజ్ మీదకి వచ్చి చెప్పమంటాడు. అలా ఒకరిని ఊహించుకుని మెడలో తాళి వేసుకుంటే అది ఊహే అవుతుంది తప్ప పెళ్ళి కాదని రిషి అనగా.. అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతారు. రిషి, వసుధారలు వీరిద్దరు మాట్లాడి‌న దాంట్లో నిజం ఉంది. ఇద్దరూ కరెక్టే.. కానీ మీకు ఎవరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందో వారి పేరుని పేపర్ లో రాసి ఇక్కడ బాక్స్ లో వేయండని జయచంద్ర చెప్తాడు. అలా జయచంద్ర స్టూడెంట్స్ తో పాటు ఫ్యాకల్టీకీ ఒపినియన్ పోల్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.