English | Telugu

నా పిల్లలని గొప్పింటికి కోడళ్ళను చేయాలని ఆశపడుతున్నాను!

'బ్రహ్మముడి' సీరియల్ స్టార్ మా టీవీలో గ్రాండ్ గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. సరికొత్తగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ గురువారం ఎపిసోడ్ -3 లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో... కనకం దుగ్గిరాల ఫ్యామిలీ లో జరిగే పూజకి ఎలాగైనా వెళ్లనుకుంటుంది. కనకం పెద్దకూతురు స్వప్నకి రాజ్ ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అందుకే స్వప్న అందంగా ఉండాలని ఫేస్ ప్యాక్ లు పెడుతుంటుంది. అదంతా చూస్తున్న కనకం భర్త "ఎందుకే మన స్థాయిలో చూసి పెళ్లి చేద్దాం.. అంతే గాని డబ్బు ఉన్న వాళ్ళని చూసి ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు" అని చెప్తాడు. "సమాజంలో డబ్బుంటేనే విలువ.. మన స్థాయివాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మన పిల్లలు మనలాగే ఉంటారు.. నేనేం నా పిల్లలను తప్పుడు పనులు చెయ్యమని అనట్లేదు... గొప్పింటికి కోడళ్ళను చేయాలని ఆశ పడుతున్నాను" అంటూ కనకం ఎమోషనల్ అవుతుంది.

మరోవైపు సీతరామయ్య నిజమైన బంగారు ఆభరణాలు అలంకరించిన వినాయకుడిని చూసి రాజ్ ని తిడతాడు. "మనకున్న ఐశ్వర్యాన్ని ఇలా చూపించుకోవాలా.. అలా చెయ్యడం తప్పు" అంటూ రాజ్ ని తిడతాడు. వెంటనే మళ్ళీ వినాయకుడికి కలర్ లతో నగలు వేయించమంటాడు. అలా చేయకుంటే నాకు కోపం వస్తుంది అని సీతారామయ్య చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

వెంటనే రాజ్ తన మేనేజర్ కి ఫోన్ చేసి వినాయకుడికి కలర్లు వేసిన వాళ్ళని రమ్మనండి అని చెప్తాడు. కాసేపటికి "వాళ్ళ ఫోన్ కలవట్లేదు" అని మేనేజర్ చెప్పగా "సరే అడ్రస్ పంపించు నేనే వెళ్తాను" అని రాజ్ బయల్దేరి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.