English | Telugu
హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఇనయా!
Updated : Nov 26, 2022
హౌస్ లో కెప్టెన్సీ కోసం ఫిజికల్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. టాస్క్ పేరు 'బాల్ ఇన్ ది సర్కిల్'. "ఒక్కో రౌండ్ లో బజర్ మోగేసరికి బాల్ ఎవరి చేతిలో ఉంటుందో వారు ఒకరిని తీసివేయవచ్చు, అలా ఒక్కో బజర్ కి ఒక్కొక్కరిని తీసుకుంటూ రావాలి. చివరి రౌండ్ లో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరి దగ్గర అయితే బాల్ ఉంటుందో వారే విజేతగా ఉంటారు" అని బిగ్ బాస్ చెప్పాడు.
అయితే మొదటి రౌండ్ లో ఓడిన ఫైమా సంచాలకులురాలిగా వ్యవహరించింది.గేమ్ మొదలై, మొదట రేవంత్ తప్పుకున్నాడు. తర్వాత ఆదిరెడ్డి తప్పుకోగా, ఇలా చివరికి శ్రీసత్య, ఇనయా మిగిలారు. వారిద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. బజర్ మోగేసరికి బాల్ ఇనయా చేతిలో ఉంది. దీంతో కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి ఇనయా కొత్త కెప్టెన్ అయ్యింది.
ఇనయాని కెప్టెన్ గా చూడాలని, మొన్న వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు చెప్పిన విషయం తెలిసిందే. "అమ్మ కెప్టెన్ అయ్యాను చూడు" అని కెమెరా చూస్తూ చెప్పుకుంది. అయితే కొత్త కెప్టెన్ గా ఇనయా గెలిచాక, "నా రూల్స్ ఏం లేవు. అందరు నచ్చినట్టు ఉండండి. నచ్చినంత తినండి" అని హౌస్ మేట్స్ కి చెప్పింది.