English | Telugu

2019లో కులూ మనాలి రూమ్‌లో రెజీనాకు ఎదురైన అనుభ‌వం?

ప్రతీ వారం 'ఆలీతో సరదాగా' షో ద్వారా ఆడియన్స్ కి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఇటీవల కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, అర్చన జగదీశ్ ఇలా ఎంతో మంది తారలు వచ్చి ఆలీతో చిట్‌చాట్‌ చేసి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్టేజి మీదకు రెజీనా కసాండ్రా రాబోతోంది. ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యింది.'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులు కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి గురించి అలీ అడిగినప్పుడు రెజీనా మాట్లాడుతూ, "ఈ వయస్సులో కూడా ఆయ‌న‌ చాలా త్వరగా విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు.ఇది చాలా ప్రశంసనీయం." అని చెప్పింది.

ఇక రెజీనా స్కూల్‌లో అబ్బాయిలను బాగా కొట్టేదట. క్లాస్ లీడ‌ర్‌గా ఉంటే అబ్బాయిల‌ను కొట్టేస్తారా? అని అలీ అడిగితే, ఆ అని ఆన్స‌ర్ ఇచ్చి న‌వ్వేసింది రెజీనా.నా ఫిజిక్‌ను చూసి అంద‌రూ న‌న్ను డామినేటింగ్ అనుకుంటారు అని కూడా చెప్పింది. "2019లో కులూమనాలిలో రూమ్ నెంబర్ తెలీదు కానీ ఒకటి జరిగింది" అని అలీ అనేసరికి "ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి నా లైఫ్‌లో" అని చెప్పుకొచ్చింది రెజీనా. అక్క‌డ ఏం జ‌రిగిందో కొంత క్లూ ఇచ్చింది.

ఇక తనకు హారర్ జానర్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. తనకు నచ్చిన సబ్జెక్టు వస్తే మాత్రం ఎలా ఉండాలి, ఎలాంటి మానరిజమ్ ను ఆడియన్స్ కి చూపించాలి అని ఎప్పుడు తపన పడుతూ ఉంటానని చెప్పింది రెజీనా. "హోటల్ కి వెళ్ళినా, క్యారవాన్ లోకి వెళ్ళినా ముందు రెజీనా అక్కడ ఎలా ఉంది అని చూడకుండా, ముందు బాత్రూంలోకి వెళ్లి ఎలా వుంది అని చూసుకుంటారంట ఏంటి?" అని అలీ అడిగితే గ‌ట్టిగా న‌వ్వేసింది. రెజీనా నటించిన కొత్త వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్' ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.