English | Telugu

అవకాశాల కోసం మహేష్ భజన చేస్తాడా ? ఆదర్శ్ ని ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేశారా ?

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎపిసోడ్ అలరించింది. అందులో రష్మీ కమెడియన్స్ ని తన ప్రశ్నలతో ఎన్కౌంటర్ చేసి వాళ్ళ నుంచి సమాధానాలను రాబట్టింది. వాళ్ళు కూడా అలాగే ఆన్సర్ చేశారు. ఇక ఇందులో మహానటి, రంగస్థలం మూవీస్ లో నటించిన మహేష్ ని హాట్ సీట్ లోకి రమ్మని పిలిచింది రష్మీ. "మహేష్ గారు మీరు సినిమా అవకాశాల కోసం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దగ్గర భజన చేస్తారట..నిజమేనా ? " భజన అంటే కాదు. మనకంటే ముందు సక్సెస్ ఐనవాళ్లు ఉంటారు కదా. వాళ్ళ టాలెంట్ కి, సక్సెస్ కి రెస్పెక్ట్ ఇవ్వడాన్ని ప్రజలు భజన అనుకుంటున్నారేమో.. అంత భజన చేసేవాడిని ఐతే అన్ని మూవీస్ లోనూ నేనే ఉండాలి కదా .. భగవంతుడు ఏది రాస్తాడో అదే మనకు వస్తుంది. రైటర్ రాసేది కూడా నాకు వస్తుంది అని నేను నమ్మను ఎందుకంటే నైట్ కి నైట్ మారిపోయే క్యారెక్టర్స్ ఎన్నో ఉంటాయి.

నాకు ఎవరి టాలెంట్ నచ్చినా అప్రిషియేట్ చేస్తాను" అని చెప్పాడు ఆదర్శ్. అతని తర్వాత ఆదర్శ్ ని హాట్ సీట్ లోకి పిలిచింది. "స్టార్టింగ్ లో మీరు సినిమాలు చేసేటప్పుడు మిమ్మల్ని కొంతమంది తొక్కేశారు అంట..అది ఎంతవరకు నిజం" అని అడిగింది. "ఇదంతా అబద్ధమండి..నన్ను ఎవరూ తొక్కేయలేదు. నాకు లక్ లేదు. అందుకే వచ్చిన మూవీస్ కూడా వెనక్కి వెళ్లిపోయాయి. హార్డవర్క్ తో పాటు లక్ కూడా కలిసి రావాలి కదా. స్మాల్ స్క్రీన్ ఐనా బిగ్ స్క్రీన్ ఐనా నాకు పేరెంట్స్ లాగ..కాబట్టి నాకు ఏదైనా ఒకటే" అని చెప్పాడు ఆదర్శ్.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.