English | Telugu
చికుబుకు రైలే సాంగ్ 100 పెర్ఫార్మెన్స్ లు ఇచ్చిన స్పెషలిస్ట్
Updated : Jul 2, 2025
ఢీ 20 షోలో కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ వస్తున్నారు. ఈ షోకి విక్రమాదిత్య, శ్రీవాణి కూతురు రాజా నందిని కూడా కంటెస్టెంట్ గా వచ్చింది. ఆమెకు శశి మాష్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఇక కూతురి పెర్ఫార్మెన్స్ చూసిన శ్రీవాణి, విక్రమ్ ఇద్దరూ కూడా స్టేజి మీదకు వచ్చారు. ఇద్దరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. "నా కూతురు ఇంత పెద్ద స్టేజి మీద పెర్ఫార్మ్ చేయడం ఇంతకన్నా అదృష్టం ఉంటుందా అనిపించింది నాకు ఒక ఆర్టిస్ట్ గా. నేను నా 7th క్లాస్ నుంచి ఈ ఈటీవీ స్టేజి మీద సినిరంజని, మనోరంజని అనే షోస్ చేసాను.
నా కూతురు పుట్టాక దాన్ని డాన్స్ క్లాస్ కి పంపించాలి అనుకున్నా కుదిరేది కాదు. ఏ డాన్స్ క్లాస్ కి వెళ్ళలేదు రీల్స్ చేస్తూ ఇంట్లోనే డాన్స్ నేర్చుకుంది. ఢీ నుంచి కాల్ వచ్చేసరికి చేయగలదా లేదా అన్న భయంగా అనిపించింది" అంటూ శ్రీవాణి చెప్పింది. తర్వాత విక్రమ్ కూడా మాట్లాడాడు " నేను డాన్సర్ ని ప్రభుదేవా మాష్టర్ అంటే ప్రాణం. ఆయన్ని కలిసి ఆయన ముందు డాన్స్ కూడా చేసాను. 2022 యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుంచి డాన్స్ చేయలేకపోయా. కానీ నా కూతురు డాన్స్ చేయడం ఆనందంగా ఉంది. ప్రభుదేవా గారు అంటే ఎంత ఇష్టం అంటే ఆయన సాంగ్ చికుబుకు చికుబుకు రైలే సాంగ్ వల్ల.. ఆ సాంగ్ ని నేను 100 పెర్ఫార్మెన్స్ లు చేసాను. ఈ సాంగ్ పెర్ఫార్మెన్స్ లో స్పెషలిస్ట్ గా ఉన్నానంటూ ఒక న్యూస్ ఆర్టికల్ గా కూడా రాశారు. సూపర్ పోలీస్ అనే మూవీ షూటింగ్ టైములో సౌందర్యగారు చేస్తున్నారు. ప్రభుదేవా గారు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. నేను వెళ్లి ఆయన ముందు కూడా డాన్స్ చేసి చూపించే ఛాన్స్ వచ్చింది." అని చెప్పి అప్పట్లో ప్రభుదేవా మాష్టర్ తో దిగిన ఫోటో అలాగే ఆ న్యూస్ ఆర్టికల్ ని కూడా స్క్రీన్ మీద చూపించారు. ఇక తన కూతురికి వెండి పట్టీలు తొడిగాడు విక్రమాదిత్య.