English | Telugu

ఇక్కడ హీరో హీరోయిన్లు ఎవరూ లేరు: కీర్తి భట్

బిగ్ బాస్ లో సోమవారం అనగానే నామినేషన్లో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరు కంటెస్టెంట్‌లని నామినేట్ చేస్తారు. రేవంత్ ని ఆదిరెడ్డి నామినేట్ చేసాడు. "గేమ్ గెలవడానికి చాలా దారులు ఉన్నాయి. ఇది నా నామినేషన్ విను రేవంత్. ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత తోపు ఐనా నేను తగ్గను" అన్నాడు ఆదిరెడ్డి. ఆ తర్వాత ఇనయాని నామినేట్ చేసిన వసంతి, "నువ్వు అక్కడ ఓకే అన్నావ్. మళ్ళీ మాట మార్చావ్. నువ్వు, నేను, రాజ్.. ముగ్గురం కలిసి రాత్రి ఒక ఒప్పందం చేసుకున్నాం కానీ నువ్వు పొద్దున అలా దొంగతనంగా గేమ్ ఆడావ్" అంది.

వసంతిని నామినేట్ చేసిన రేవంత్, "టూ వీక్స్ కంటిన్యూస్ గా నామినేట్ చేసావ్. కొట్టాలి అనే ఇంటెన్షన్‌తో నన్ను కొట్టావ్. గేమ్ అంటే ముందుకొచ్చి ఆడాలి." అని అన్నాడు.

ఆదిరెడ్డిని రేవంత్ నామినేట్ చేసాడు. "వాంటెడ్ గా అన్నారు. నేను హర్ట్ అయ్యాను." అని అన్నాడు. ఆ తర్వాత శ్రీహాన్ ని నామినేట్ చేసిన కీర్తి భట్, "లాస్ట్ నామినేషన్లో హ్యుమానిటి గురించి నామినేట్ చేసావ్ చాలు ఇక. నువ్వు హీరో కాదు. ఇక్కడ హీరో, హీరోయిన్‌ లు ఎవరు లేరు." అంది. తర్వాత శ్రీహాన్ మాట్లాడుతూ, "సరే బయల్దేరు" అని అనగా, "ఇది ఓవర్ అని అనిపించలేదా. ఇక్కడ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా.. ఇదే తగ్గించుకో శ్రీహాన్" అని కీర్తి భట్ అంది. ఆ తర్వాత ఇనయాని నామినేట్ చేసిన కీర్తి భట్, "నువ్వు సారీ చెప్పావ్. కానీ అగ్రెసివ్‌నెస్ కొంచెం తగ్గించుకో" అని చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.