English | Telugu

అమర్ దీప్‌కి వెన్నుపోటు పొడిచిన ప్రియాంక జైన్!

నా అనుకున్నవాళ్ళే మోసం చేస్తే దానిని ఏం అంటారు. నమ్మినవాళ్ళే మనల్ని అనర్హులని అంటే ఎలా ఉంటుంది. అయిన వాళ్ళని మనవాళ్ళలా చూస్తే ఏం జరుగుతుంది. ఇవన్నీ బిగ్ బాస్ బ్యూటీ అరియాన చెప్పిన మాటలు. బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే కంటెస్టెంట్స్ తమ‌ స్ట్రాటజీలతో గేమ్స్ ఆడుతున్నారు. సీరియల్ బ్యాచ్ అంటూ ఎప్పుడు కలిసి ఉండే ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి మధ్య కూడా పాలిటిక్స్ జరుగుతున్నట్టు నిన్నటి ఎపిసోడ్‌లో తెలిసింది. అమర్ దీప్ కి ప్రియాంక జైన్ నిజంగానే వెన్నుపోటు పొడిచింది. దీనిపై స్పందిస్తూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది అరియాన.

అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియాన.. అరియాన మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియాన. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియాన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అరియాన అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియానాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియాన చాలా బాధపడింది.

కొత్తగా పరిచయమైన కంటెస్టెంట్స్ కి అమర్ దీప్ డిజర్వింగ్ అనిపించింది.‌ కానీ బయటను, ఇంట్లోను క్లోజ్ గా ఉండే ఒకరికి మాత్రం అన్ డిజర్వింగ్ అనిపించింది. అమర్ దీప్ వెనుకలా అతను వీక్ కంటెస్టెంట్ అని చెప్పి, పోటీకీ అనర్హుడని చెప్పి , మళ్లీ తనకి ఎక్కడ తెలిసిపోతుందోనని.. 'బిగ్ బాస్ నా ఒపీనియన్ ని చేంజ్ చేసుకోవచ్చా' అని రిక్వెస్ట్ చేసింది ప్రియాంక జైన్. తను వెన్నుపోటు పొడుస్తుందని నా‌ మొద్దు ఫ్రెండ్ అమర్ దీప్ కి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.‌ అమర్ నువ్వు బయటకొచ్చాక ఈ వీడియో చూడమని అరియాన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.