English | Telugu

Prashanth vs Goutham Krishna: పల్లవి ప్రశాంత్ vs గౌతమ్.. నామినేషన్ ల హైరానా!


బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికి పదకొండు వారాలు పూర్తిచేసుకుంది. ఇక పన్నెండవ వారం నామినేషన్ లతో హీటెక్కిపోయింది హౌస్. గతవారం గౌతమ్, అశ్వినిశ్రీ చివరిదాకా వెళ్ళి సేవ్ అయ్యారు.‌ ప్రస్తుతం హౌస్ లో ఎవరు అనర్హులు అని తేల్చే నామినేషన్ ప్రక్రియ మొదలైంది.

గత వారం మొత్తం ఎవరు ఏ టాస్క్ ఆడారు? ఎవరెలా మాట్లాడారు? ఎవరేం చేశారో వివరిస్తూ ఒక్కో కంటెస్టెంట్ మరొక కంటెస్టెంట్ ని నామినేట్ చేస్తారు. నామినేషన్ ప్రక్రియ లో భాగంగా పల్లవి ప్రశాంత్ ని రతిక నామినేట్ చేసింది. గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అర్జున్ ఎన్ని ఇటుకలు తీసుకొచ్చాడు నువ్వెన్ని తీసుకొచ్చావ్ అంటూ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది రతిక. నీ నామినేషన్ లో నాకు ఏ పాయింట్ కనపడలేదు సేఫ్ గా ఆడావని రతికతో పల్లవి ప్రశాంత్ అన్నాడు.

మొన్న జరిగిన విల్లుపై బాల్ బ్యాలెన్స్ టాస్క్ లో.. ఫౌల్స్ చేసిన యావర్, శివాజీ విన్ అయ్యారు. వాళ్లిద్దరు క్లియర్ గా పట్టుకున్నప్పుడు ప్రియాంక విన్ కావాలి కదా కానీ సంఛాలక్ గా నువ్వు ఉన్నావ్ అది నువ్వు చెప్పలేదు. ఫెయిల్ అయ్యావని ప్రశాంత్ ని గౌతమ్ నామినేట్ చేశాడు. నా పంచ ఆనవాయితీ లెక్క నీ అనవాయితీ కూడా సాగిందని గౌతమ్ అనగా.. ఆ పంచ ఊడకుండా చూసుకోమని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఆ తర్వాత గౌతమ్ రెచ్చిపోయి ఎక్కువ తక్కువ మాట్లాడకు.. నన్ను అనడానికి నువ్వు ఎవరని గౌతమ్ అనగానే.. బరాబర్ మాట్లాడతానని ప్రశాంత్ అన్నాడు. పంచ అనేది తెలుగోడి సంస్కృతి దాని గురించి నువ్వు మాట్లాడటం మంచిది కాదని గౌతమ్ అన్నాడు. నేను అలా అనలేదని, పంచ ఊడిపోకుండా చూసుకోమని మాత్రమే అన్నానని పల్లవి ప్రశాంత్ సరైన వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత శివాజీని గౌతమ్ కృష్ణ సిల్లీ రీజన్ తో నామినేట్ చేసాడు. ఒక ఆడియన్ గా నేను చూసాను‌‌ మీరు చేసింది తప్పు అంటూ గౌతమ్ అనగానే.. నీ దగ్గర నామినేట్ పాయింట్ లేకుంటే మాట్లాడకు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.