English | Telugu

శివన్న ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు..  ఇది కదా స్పై బ్యాచ్ క్రేజ్ అంటే!

బిగ్ బాస్ సీజన్‌ -7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇక గ్రాంఢ్ పినాలే రోజున అతని ఆబిమానులు భారీగా అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగా నిల్చొని ట్రాఫిక్ వాయిలెన్స్ క్రియేట్ చేశారు. దీంతో పాటుగా కొందరు దుండగులు కారు అద్దాలని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసారు.

దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ విధ్వంసం జరగడానికి కారణమైన ‌పల్లవి ప్రశాంత్ ని A1గా, అతని డ్రైవర్ రాజుని A2 గా పరిగణించి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారిని చంఛల్ గూడ జైలుకి రిమాండ్ కి పంపించింది. ఇక రెండు రోజుల తర్వాత అతనిని బెయిల్ మీద విడిపించాడు భోలే షావలి.

రైతుబిడ్డకి పాటబిడ్డ భోలే షావలి తోడుగా నిలిచాడు. సుమారుగా యాభై మంది లాయర్లతో భోలే షావలి మాట్లాడి ప్రశాంత్ కి బెయిల్ వచ్చేలా చేశాడు‌. ఇక ప్రశాంత్ బయటకొచ్చాక.. శివాజీ, యావర్, భోలే షావలి, నయని పావని,‌ టేస్టీ తేజ, శుభశ్రీ కలిసారు. వీరితో పాటు శివాజీ కొడుకు రిక్కీ కూడా ఉండటంతో శివాజీ ఫ్యామిలీకి ప్రశాంత్ ఎంత దగ్గర అయ్యాడో తెలుస్తుంది. ఇక అందరు కలిసి భోలే షావలి ఇంట్లో భోజనం చేశారు. జైలులో ప్రశాంత్ ఉన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వారి పేరెంట్స్ తో శివాజీ మాట్లాడుతూ ధైర్యం చెప్పి అండగా నిలిచాడు. ఇక శివాజీ, నయని పావని, భోలే, యావర్, టేస్టీ తేజ అందరు కలిసి సరదాగా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు స్పై బ్యాచ్ గా ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్ బయటకొచ్చాక ఒకే స్క్రీన్ మీద కనిపించేసరికి వీరి అభిమానులకు ఒకరకంగా పండుగలా అనిపించింది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన వీరి ముగ్గురు కలసి ఉన్న వీడియోలే కనిపిస్తున్నాయి. " ఏం తప్పు చేయని వాడు దేనికి భయపడడు. వాడు చట్టాన్ని గౌరవించాడు. వాడు నేరస్తుడు కాదు భాదితుడు. ఎవరో చేసిన పనికి వాడు కారణమయ్యాడు వాడేం తప్పు చేయలేదు" అంటు శివాజీ మాట్లాడిన మాటలన్నీ పల్లవి ప్రశాంత్ అభిమానులకి జరిగిన గాయానికి మందుల్లా పనిచేశాయి.

పల్లవి ప్రశాంత్ జైలులో ఉన్నప్పుడు ఆట సందీప్ అతని భార్య జ్యోతి, అశ్వినిశ్రీ, ఆదిరెడ్డి బాగా సపోర్ట్ చేశారు. ఇక బయటకు రాగానే వెన్నంటే ఉన్న శివాజీని కలిసాడు ప్రశాంత్.‌ శివాజీ తన అఫీసియల్ ఇన్ స్ట్రాగ్రామ్ పేజ్ లో ప్రశాంత్‌తో కలిసి లైవ్‌లో మాట్లాడాడు. "బిడ్డా.. ఏరా వారి.. చెప్పరా వాళ్లందరికీ.. శివన్న ఎక్కడ ఎక్కడా అని ఓ అరుపులు.." అంటూ ప్రశాంత్‌తో అన్నాడు. "శివన్న ఎప్పుడూ నా గుండెల్లో ఉంటాడు.. మీ అందరి ప్రేమను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. నాకు అన్న లేడు అని ఉండే.. కానీ నేను చచ్చిపోయేంతవరకూ అన్ననే నాకు అన్నా.. థాంక్యూ సో మచ్ అన్నా.." అంటూ ప్రశాంత్ అన్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు శివాజీ, ప్రశాంత్ లని చూసిన ఎవరైన గురుశిష్యులనే అంటారు. బయటకొచ్చాక ప్రశాంత్, యావర్ కలిసి శివాజీని ఎత్తుకోవడంతో శివాజీకి కుడిభుజం, ఎడమ భుజంలా ఇద్దరు ఉన్నట్టుగా అనిపించింది. బిగ్ బాస్ సీజన్-7 లో స్పై బ్యాచ్ కి ఉన్న క్రేజ్ మాములుగా లేదని మరోసారీ ఋజువైంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.