English | Telugu

Krishna Mukunda Murari:భవానిని రెచ్చగొట్టిన దేవ్.. ఏడుస్తూ వెళ్ళిపోయిన కృష్ణ!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 349లో.. రేవతి, మధు ఇద్దరు మాట్లాడుకుంటారు. విన్నావు కదరా మధు.. ముకుంద ఇంట్లో వాళ్ల మాట కూడా వినడం లేదట ఎలారా అని రేవతి అనగానే.. ఆ మాట పక్కన పెడితే ముకుంద తనకు అన్న ఉన్నట్లు, శ్రీనివాస్‌ గారికి కొడుకు ఉన్నట్లు ఇంతవరకు మనకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. నీ మొహం శ్రీనివాస్ అన్నయ్యని మనతో తీరికగా కూర్చొని మాట్లాడే అవకాశం ఎప్పుడు ఇచ్చింది ముకుంద అని రేవతి అంటుంది. అది నిజమేలే అని మధు అంటుండగా మురారి అక్కడికి వస్తాడు. హాయ్ మురారి కేసు ఎంత వరకు వచ్చిందని మధు అడుగుతాడు. ఓ కొలిక్కి వచ్చినట్లే నేను కృష్ణ మాట్లాడుకుంటున్నప్పుడు దేవ్.. అదే ముకుంద బ్రదర్ నా దగ్గరకు ముకుందను తీసుకొచ్చాడని మురారి చెప్తాడ. " ఏం అన్నాడు. అటు ఇటు చూసి ఠక్కున నీ కాళ్ళు పట్టుకొని నా చెల్లిని పెళ్లి చేసుకో అన్నాడా" అని మధు అంటాడు. దానికి ఫుల్లుగా రివర్స్ అనుకో అని దేవ్ మాటలన్నీ చెప్తాడు. ఈ కేసులో సహాయం చేస్తా అన్నాడు. ఏం కేసో ఏంటో వచ్చే శుక్రవారం లోపు ఇవన్నీ తేలకపోతే అంతే అని రేవతి అనగానే.. అమ్మా.. ఆ దేవ్ ముకుందను ఇంటికి తీసుకెళ్తాడేమో కానీ పెళ్లి మాత్రం చేయడు. ఆ నమ్మకం నాకు ఇచ్చాడు. అలా అని నేను రిలాక్స్ అవ్వనని మురారి‌ అంటాడు. నిజంగా ఆ దేవ్‌కు చెల్లిమీద అంత ప్రేమ ఉందా? అయితే నువ్వు ఎటు కేసు చూస్తున్నావ్ ఆ అబ్బాయిని ఆదర్శ్ ని వెతకడానికి వెళ్లమని చెప్పొచ్చు కదా అని రేవతి అంటుంది. ముకుంద ఎలా ఊరుకుంటుంది. తెలియకుండా వెళ్లడం కష్టం. వాళ్ల నాన్న గారు కూడా ఇంట్లో లేరంట. మరి చెప్పకుండా ఎలా వెళ్తాడు. ఆదర్శ్ రాడు అమ్మా. కృష్ణ ఏదో వస్తాడు అంటుంది కాదు. నాకు అయితే నమ్మకం లేదని మురారి అంటాడు.

మరోవైపు దేవ్, కృష్ణ కలిసి మురారి ఇంటికి క్యారేజ్ తీసుకొని వస్తారు. దేవ్ ఇంట్లో వాళ్లందరిని హాల్లోకి రమ్మని పిలుస్తాడు. ఇంతలో మురారి కృష్ణతో ఓ గెస్ట్‌ అంతే ఇతనేనా.. అని అంటాడు. ఇక రేవతి మనసులో అక్కయ్య ఏం అంటుందో ఏంటో అని అనుకుంటుంది. మరోవైపు ముకుంద మనసులో దేవ్‌ని ఉద్దేశించి వీడి ఓవర్ యాక్షన్ ఎటు దారితీస్తుందో ఏంటో అని అనుకుంటుంది. మేడమ్ నేను మా చెల్లి కృష్ణ కలిసి మనందరికి చేపల పులుసు చేశాం. మా బావకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంట కదా. కృష్ణ చెప్పిందని దేవ్ అంటాడు. ఇక అక్కడే ఉన్న భవానిని చూసి మురారి తన మనసులో.. పెద్దమ్మ ఎలాంటి రచ్చ చేయకముందే నేనే ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. దేవ్ థ్యాంక్యూ. ఫిష్ కర్రీ తిని చాలా రోజులు అయిందని మురారి అంటాడు. సారీ పెద్దత్తయ్య చేపల పులుసు ఇవ్వడానికి మాత్రమే వచ్చాను ఇచ్చేసి వెళ్లిపోతానని కృష్ణ అనగానే.. కృష్ణ నువ్వు ఈ ఇంటికి రావొచ్చు వెళ్లొచ్చని చెప్పాను కదా దానికి నవ్వు ఏదో తప్పు చేసినట్లు అని మురారి చెప్తుంటాడు. తప్పే చేసింది. ముమ్మాటికి తప్పు చేసింది. అసలు మన ఇంటి పరువు తీసి మనకి మనస్శాంతి లేకుండా చేసిన ఈ కృష్ణని మీరంతా ఎలా అంగీకరిస్తున్నారో. నీకు అంత పెద్ద యాక్సిడెంట్ చేసి నీ రూపాన్నే మార్చేసిన వారిని నువ్వు అంత తేలికగా క్షమించేశావేమో మురారి.. నేను క్షమించలేను. ఈ ఇంట్లో క్రమశిక్షణకు అర్థం లేకుండాపోయింది. నువ్వు వచ్చిన తర్వాతే వాళ్లు మారారని భవాతి అనగానే.. అక్కయ్య వదిలేయ్. కృష్ణ వెళ్లు, చేపలు పులుసు వద్దు ఏం వద్దు నువ్వు తీసుకెళ్లు దేవ్ అని రేవతి అనగానే.. నేను రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని దేవ్ మొదలెడతాడు. కృష్ణ మంచిది అనేది పచ్చి నిజం. భార్యాభర్తల బంధాన్ని మీరు తప్పుగా అని చెప్పలేపే.. షటప్ ఆ మాటకి వాళ్లిద్దరూ అర్హులు కారు. అవును వీళ్లది అగ్రిమెంట్ పెళ్లి. గౌరవప్రదమైన మా వంశ గౌరవం ఎక్కడ బయటపడుతుందోనని వీళ్ల దారుణాన్ని క్షమించానని భవాని అంటుంది. పెద్దమ్మ ప్లీజ్.. అని మురారి అంటాడు. బావ కృష్ణని నమ్ముతున్నాడు. మీరు దాని గురించి తెలీకముందు కృష్ణని యాక్సెప్ట్ చేశారు కదా అని దేవ్ అడిగేసరికి.. అదే నేను జీవితంలో చేసిన మొదటి తప్పు. మళ్లీ వీళ్లని క్షమించి రెండో తప్పు చేయలేనని భవాని చెప్తుంది. ఇక్కడ అందరు ఆ కేసు గురించి మర్చిపోండి. నేను చూసుకుంటా కదా అని మురారి అంటాడు. ఏం చూసుకుంటావ్ మురారి. కేసు క్లోజ్ చేసి ఆ జనాల్ని చూసుకుంటావా.. ఇదే కదా నువ్వు చూసేదని భవాని అంటాడు. నా గురించి మీరందరూ గొడవ పడకండి నేనే వెళ్లిపోతానని కృష్ణ అంటుంది. కృష్ణ ఎక్కడికి.. నువ్వు నేరస్తురాలివి అని తెలిసే వరకు నువ్వే ఈ ఇంటి కోడలివి. ఒకవేళ నేరం రుజువు అయినాక అప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారం ముకుంద ఈ ఇంటి కోడలు అవుతుంది. అప్పటి దాక నువ్వు ఈ ఇంటి కోడలివే. ఎటూ ఈ కేసులో నువ్వు నిర్దోశివి అని తేలుతుంది. అప్పుడు ఇప్పుడు నువ్వే కోడలివి అని దేవ్ అంటుండగానే.. ఆపు దేవ్.. ఈ ఇంటి కోడలు ఎవరు అని చెప్పాల్సింది నువ్వు కాదు. నీకేం తెలుసు? నీకు ఏం తెలీకుండానే మనుషుల్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని భవాని అంటుంది. దేవ్ నోరు మూసుకొని ఉండలేవా? అయిన సొంత చెల్లి నన్ను చూడ్డానికి వచ్చినవాడివి ఇలా అవుట్ హౌస్‌లోను ఇంకెక్కడో ఉన్నవారి కోసం ఎందుకని ముకుంద అనగానే.. అవుట్ హౌసో ఇంకెక్కడో అసలు నువ్వు పెళ్లి అయిన వాడి ప్రేమలో పడకపోతే అని దేవ్ అంటాడు. దేవ్.. ఇప్పటి దాకా ముకుందకు అన్నయ్యవి అన్న గౌరవంతో ఇప్పటి వరకు ఏం అనడం లేదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చనువు తీసుకున్నావు ఇక చాలు. ఇప్పుడు చెప్తున్నా విను నేరం రుజువు అవుతుంది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ఇంటి కోడలు, మురారి భార్య ముకుందనే. నాకు ఆ నమ్మకం ఉంది నా నమ్మకం ఎప్పుడు ఒమ్ముకాలేదు. వచ్చిన వాళ్లు వచ్చిన దారినే వెళ్లొచ్చని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటు వెళ్ళిపోతుంది.

ఇక ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోతారు. ముకుంద, దేవ్ వాళ్ళ గదిలో ఉంటారు. ముకుంద గదిలో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఏదో‌ ఆలోచించి దేవ్ నవ్వగానే.‌. అతడిని చూస్తుంది ముకుంద. ఎందుకు దేవ్ నవ్వుతున్నావు. చెప్పు అని ముకుంద అనగానే.. ఇందాక మీ అత్త దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తూ కృష్ణని పొగిడాను కదా. అవన్నీ నిజాలే అనిపించాయి ముకుంద లేకపోతే అంత ఫ్లో ఎలా వస్తుంది చెప్పని దేవ్ అంటాడు. ఏంటి జోకా. అవన్నీ నిజాలే కావొచ్చు నేను ఒప్పుకుంటాను కానీ. మురారి కృష్ణతో ఉంటే మాత్రం నేను ఒప్పుకోనని ముకుంద అంటుంది. నేను ఒప్పుకోను అనుకో అయిన వాళ్లది అగ్రిమెంట్ పెళ్లి అని తెలిసి మీ అత్త దగ్గర నువ్వు ఇన్నాళ్లు దాచావ్ చూడు అది మాత్రం కచ్చితంగా నీ తప్పే ముకుంద అని దేవ్ అంటాడు. టైం కోసం వెయిట్ చేశానని ముకుంద‌ అనగానే.. కరెక్టే నువ్వు అప్పుడు కాకుండా ఇంకెప్పుడో చెప్తే.. యాక్సిడెంట్ కావడం గతం మర్చిపోవడం నేను కెన్యా నుంచి రావడం ఇవన్నీ జరిగేవి కాదు. సో నాకు ఎందుకో నీకు మురారికి పెళ్లి గ్యారెంటీగా జరుగుతుంది అనిపిస్తుందని దేవ్ అంటాడు. నిజమేరా దేవ్ నువ్వు రావడం కృష్ణ మురారిలకు అండగా ఉన్నట్లు నటించడం అది మాత్రం హైలెట్. ఇక ఇప్పట్లో నువ్వు నేను చెప్తే తప్ప ఎవరికి నీ గురించి చెప్పక్కర్లేదు. కానీ.. ఒక వేళ మా పెళ్లి అయ్యాక నీ విషయం తెలిసిందే అనుకో. అగ్రిమెంటో అరెంజ్‌నో కృష్ణ, ముకుందలకు పెళ్లి కాలేదో అత్తయ్య విడదీయడం లేదా.. అసలే ఆ మురారి కనీసం ఒక రెండు నిమిషాలు కూడా నాతో మాట్లాడటం లేదని ముకుంద అంటుంది. నేను మీ పెళ్లి అయ్యాక నా దారిన నేను కెన్యా వెళ్లి పోతే ఆ శ్రీనివాస్‌ ని ఇంట్లో దిగబెట్టి వెళ్లిపోతా అని దేవ్ అంటాడు. చూడు ముకుంద నువ్వు ఏ టెన్షన్ పడకు. పెళ్లి అయ్యాక నువ్వు అమెరికా వెళ్లిపో ఇక పెళ్లికి ముందు నా గురించి బయట పడినా నువ్వేం భయపడకని దేవ్ అనగానే.. బయట ఎందుకు పడుతుంది దేవ్ అని ముకుంద అంటుంది. చెప్పలేం కదా.. ఏం జరిగిన ఎటాక్ చేయడానికి రెడీ గా ఉండు.. ఇక నేను వెళ్తున్నా గుడ్ నైట్ అని దేవ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.