English | Telugu

చంఛల్ గూడ జైలులో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ సీజన్‌ -7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయాన్ని రెండు రోజులు కూడా ఆనందించకముందే అతనిపై పోలీసు కేసు నమోదవ్వడం, పోలీసులు గాలించి మరీ అతడిని అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

నిన్న ఉదయం పల్లవి ప్రశాంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ పెట్టాడు. అందులో నా తప్పేం లేదు. నన్ను నెగెటివ్ చేయడానికి‌ కొంతమంది ఇలా చేస్తున్నారని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అయితే నిన్న రాత్రి సమయంలో పోలీసులు వెళ్ళి పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు.‌ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రాంఢ్ ఫినాలే రోజున వాహానాలు ధ్వంసం చేసినందుకు గాను, ట్రాఫిక్ వాయిలెన్స్ ని క్రియేట్ చేసినందుకు గాను కొందరిపై‌ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా చేసినట్టు తెలిసింది. అయితే ఇందులో తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. నిన్న రాత్రి పల్లవి ప్రశాంత్ వాళ్ళ సొంతింటి దగ్గర అందరిముందు జూబ్లీ హిల్స్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి విచారణ అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.

ఇక కేసుని పరిశీలించిన న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో పల్లవి ప్రశాంత్, రాజుని చంచల్ గూడ జైలుకి తరలించారు పోలీసులు. ఇక ఆ రోజు కారు అద్దాలు ధ్వంసం చేసిన మరికొంతమంది దుండగుల కోసం గాలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని జూబ్లీ హిల్స్ పోలోసులు మీడియాకి తెలియజేశారు. అయితే ఫ్యాన్స్ చేసిన తప్పు వల్ల రైతుబిడ్డ జైలుకెళ్ళాడు. కామన్ మ్యాన్ గా వెళ్ళి టాస్క్ లలో ఎంతో కష్టపడి కాళ్ళు, చేతులు విరగ్గొటుకొని చివరికి టైటిల్ గెలిచి బయటకొస్తే ఆ విజయాన్ని రెండు రోజులు కూడా ఆస్వాదించకముందే ఇలా అవ్వడం చాలా బాధాకారమని పలువురు బిబి కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఇన్ని సీజన్‌ లలో టైటిల్ గెలిచిన ఓ కంటెస్టెంట్ కి ఇలా జరగడం ఇదే ప్రథమం. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ చంఛల్ గూడ జైలుకి వెళ్ళాడనే వార్త వైరల్ గా మారింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.