English | Telugu

మిమ్మల్ని చూస్తుంటే ఆర్ఆర్ఆర్ లో రామ్ భీమ్ ని చూసినట్టుంది!

బిగ్ బాస్ హౌస్ లో అందరు ఎంతగానో ఎదురు చూసే వీకెండ్ రానే వచ్చింది. నాగార్జున చీవాట్లు పెట్టే ఈ ఎపిసోడ్ కి వారమంతా ఎదురుచూస్తునే ఉంటారు. కానీ ఈ వారం స్పైసీ కొంచెం తగ్గినట్లుంది. ఆదివారం జరగాల్సిన ఫన్ డే కాస్త శనివారమే జరిగింది. ఈ వారం హౌస్ మేట్స్ అందరు బాగా పర్ఫామెన్స్ ఇచ్చారు. నాగార్జున మొదట కర్రతో వచ్చాడు కానీ తర్వాత కామెడీనే చేసాడు.

హౌస్ మేట్స్ తో నాగార్జున ఒక్కొక్కరిగా తమ అటతీరు గురించి చెప్పుకొచ్చాడు. మొదటగా పృథ్వీ ఈ వారం ఫుల్ ఫైర్ తో ఆడావు.. నువ్వు టాస్క్ లో ఉన్నావంటే రాయల్స్ కి భయం పుట్టేలా చేసావంటూ పృథ్వీని మెచ్చుకున్నాడు నాగార్జున. కానీ నామినేషన్ అప్పుడు రోహిణిని నువ్వు చుసిన చూపు కొంచెం హర్టింగ్ గా ఉంటుంది. ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోమంటూ స్మాల్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుతూ.. ఈ వారం చాలా బాగా అడావు. పృథ్వీది నీ కాంబినేషన్ సూపర్ మిమ్మల్ని చూస్తుంటే.. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ భీమ్ లా అనిపించిందని నాగార్జున వాళ్లకి బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ఆ తర్వాత నిఖిల్ సంచాలకుడిగా ఉన్నప్పుడు.. తీసుకున్న నిర్ణయం సరైనదేనా అంటూ హౌస్ మేట్స్ ఓపీనియన్ అడుగుతాడు. ఆ తర్వాత మిగతా హౌస్ మేట్స్ ఆటతీరు.. వారు చేసిన మిస్టేక్స్ అన్నీ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఈ వారం నిఖిల్, పృథ్వీలు ఇద్దరు నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళు పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ నుండి ఇద్దరు సేవ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.