English | Telugu

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ.. ఆ విలన్ ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ లో కథ కొత్తగా మలుపు తిరిగింది. నిన్న మొన్నటిదాకా ముకుంద చేసే పనులతోనే కృష్ణ, మురారీల మధ్య దూరం పెరిగిందంటే.. ఇప్పుడు మరో కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చాడు.

అసలెవరితను? ఎందుకొచ్చాడంటూ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా అతనెవరో కాదు. ముకుందకి అన్నయ్య అని తెలస్తుంది. మరి ఇతనేం చేశాడు? ఇంతకముందు ఎక్కడున్నాడంటు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అభిమానులు అడుగగా.. వారి ప్రశ్నలకి సమధానంగా నిన్నటి ఎపిసోడ్ లో.. అతను ముకుంద వాళ్ళ అన్నయ్య అని తెలిసింది. తన ప్రేమని మురారి అర్థం చేసుకున్నాడని లెటర్ చదివి తెలుసుకున్న కృష్ణ.. కార్ లో వెళ్తూ.. సంతోషంగా ఐ లవ్ యూ ఏసీపీ సర్ అని అనగానే వెనుకాల నుండి లారీ వచ్చి ఢీ కొడుతుంది.

ఆ తర్వాత ఒక అంబులెన్స్ వస్తుంది. అందులో నుండి దిగిన వ్యక్తి గాయాలతో పడిఉన్న కృష్ణ, మురారీలని చూసి నవ్వుకొని వెళ్ళిపోతాడు. కాసేపటికి ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే.. శ్రీనివాస్ వస్తాడు. ఈ విలన్ ని చూసిన శ్రీనివాస్.. నువ్వా? జైలు నుండి ఎప్పుడొచ్చావ్? ఎందుకు వచ్చావని అడుగుతాడు. అవేమీ పట్టించుకోకుండా ముకుంద ఎలా ఉంది. నేను అన్నం తినేసి వెళ్తానని అంటాడు. ఆ తర్వాత ముకంద వస్తుంది. తనని చూసిన ఈ విలన్ వచ్చి కౌగిలించుకొని.. ఎప్పుడు తనని సంతోషంగా చూసుకుంటానని మాటిస్తాడు.

ముకుందకి అన్నగా కొత్త పాత్రగా ఈ కథలోకి వచ్చాడు విలన్‌. అయితే ముకుంద ఇతనితో ముందే చెప్పిందా లేక ఇతను ముకుంద జీవితాన్ని దగ్గరుండి తెలుసుకున్నాడా అనేది సస్పెన్స్ గా మారింది. మరి యాక్సిడెంట్ లో గాయాల పాలైన కృష్ణ, మురారీలు బ్రతుకుతారా? ఈ విలన్ రోల్ ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.