English | Telugu

వర్ష మీద ఫైర్ అవుతున్న నెటిజన్స్...స్కూల్ కి అలాగా వెళ్ళేది అంటూ...

ఈ మధ్య కాలంలో బుల్లితెర కమెడియన్స్ హంగామా మాములుగా ఉండడం లేదు. సినిమాలు చూసి చాలా ఎక్కువగా ఊహించేసుకుంటూ ఉన్నారు. ఈమధ్య మూవీ సాంగ్స్ ని రీషూట్ చేయించుకుని వాటిల్లో మూవీ హీరోయిన్స్ కంటే ఎక్కువ స్టైల్ గా బుల్లితెర కమెడియన్స్ నటించి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు.

ఐతే కొన్ని సందర్భాల్లో అవి వివాదాస్పదమవుతున్నాయి. రీసెంట్ గా వర్ష "మాస్టారు మాస్టారు" సాంగ్ కి డాన్స్ చేసిన ఒక వీడియోని తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. "ఘర్షణ" మూవీలో ఆసిన్ స్కూల్ టీచర్ రోల్ లో కాటన్ శారీ కట్టుకుని వెళ్లినట్టు ఇక్కడ వర్ష కూడా అలాగే శారీ కట్టుకుని బుక్ పట్టుకుని వీడియోలో కనిపించింది. ఐతే ఈ వీడియో ఒక స్కూల్ లో షూట్ చేశారు. ఇక ఒక అబ్బాయి వచ్చి "ఐ లవ్ యు మేడం" అని బుక్ లో రాసి వర్షకి ఇవ్వడం మాత్రం నెటిజన్స్ కి అస్సలు నచ్చలేదు. అంతేకాదు వర్ష వేసుకున్న బ్లౌజ్ మీద కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. "అలాంటి బ్లౌజ్ వేసుకుని స్కూల్ కి వెళ్తే చండాలం, యాక్టింగ్ ఓకే కానీ స్కూల్ టీచర్ లా ఉంటే ఇంకా బాగుంటుంది, స్కూల్ ని ఖరాబ్ చేస్తున్నారు, మేడం స్పెల్లింగ్ తప్పు రాసాడు, మంచి సాంగ్ ని చెడగొట్టావ్, మొత్తానికి బుక్ ఇచ్చినతన్ని చూపించలేదు" అంటూ మండిపడుతున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.