English | Telugu

మగవాళ్ల కన్నా ఆడవాళ్ళకు వెంకీ ఆసనం చాలా అవసరం...


నేహా చౌదరి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక డల్ పోస్ట్ పెట్టింది. అందులో తన పరిస్థితి వివరించింది. "హాయ్ అందరికి.. అందరు బాగున్నారని అనుకుంటున్నా...ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.. ఒక ఆరు రోజులుగా సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో ఎక్కడా యాక్టివ్ గా లేను. ఎందుకంటే ప్రేగ్ ప్రాంతానికి డిసెంబర్ 31 న వెళ్లాం. ఫైర్ వర్క్స్ చూడడం కోసం అందరం అక్కడికి వెళ్లాం..అక్కడ మేము చేసిన స్టెంట్స్ వల్ల నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. నా లైఫ్ లో నాలుగు రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. ఆ దేవుడికి నిజంగా ధ్యన్యవాదాలు..అనిల్ నన్ను దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు అంతా బాగుంది.

నా గురించి తెలుసుకున్న అందరికి చాలా థ్యాంక్స్. ఐ యాం బ్యాక్." అంటూ ఒక వీడియోని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. అలాగే ప్రేగ్ లో వాళ్ళు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో చేసిన అల్లరి మొత్తాన్ని కూడా వీడియో చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. డిసెంబర్ 31 న ప్రేగ్ లో రాత్రి 4 డిగ్రీల చలిలో అందరూ సెలెబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారు. ఇక నేహా చౌదరి పరుగుపరుగున నడుస్తూ కనిపించింది ఆ వీడియోలో. 360 డిగ్రీస్ యాంగిల్ లో అక్కడ జరిగిన ఫైర్ వర్క్స్ ని చూపించింది. ఈ ఫైర్ వర్క్స్ చూడ్డానికి ఒక బ్రిడ్జి నుంచి ఇంకో బ్రిడ్జి మీదకు చాలా దూరం నడిచారు..ఇక తన జీవితంలో దొరికే మగాళ్ల గురించి కూడా చెప్పింది వాళ్ల నాన్న వాళ్ల అమ్మను వదిలేసి నడిచేవాడట, వాళ్ల తమ్ముడు స్పీడ్ గా వెళ్ళిపోతూ గబగబా నడువు అని అరిచేవాడట ఇప్పుడు తన భర్త కూడా తనను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడట. ఇక తనతో పాటు స్పీడ్ గా రొప్పుతూ నడిచిన నేహా "ఇలాంటి టైంలోనే వెంకీ ఆసనము బాగా పనికొస్తుంది. మగవాళ్లకు కాదండి ఆడవాళ్లకు కూడా ఇంకా ఎక్కువ అవసరం.." అంటూ చెప్పింది. ఇక చివరిలో అక్కడ ఫైర్ వర్క్స్ చూపించి " ఐ యాం ఇన్ లవ్ విత్ ప్రేగ్" అని అక్కడ గట్టిగా అరిచింది నేహా.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.