English | Telugu

బిగ్ బాస్ స్టేజి నుంచి డైరెక్టుగా పెళ్లిమండపానికి...ఇప్పటివరకు ఇలా ఎవరికీ జరగలేదు!

బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కి ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా వచ్చేసారు. ఇక కొత్త పెళ్లికూతురు నేహా చౌదరి కూడా వచ్చింది. ఐతే బిగ్‌బాస్‌ ఫినాలే రోజునే… నేహా చౌదరి పెళ్లి కూడా. దీంతో పెళ్లి కూతురిని చేసిన తర్వాత.. నేహా చౌదరి.. డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌ ఫినాలేలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. "మీరు ఇక్కడ విన్నర్ ని అనౌన్స్ చేస్తూ ఉంటారు అక్కడ నేను తాళి కట్టించుకుంటూ ఉంటాను.

విధి ఆడిన వింత నాటకం సర్ ఇది. రెండూ ఒకే టైమింగ్ లో వచ్చింది. ఇకపొతే నాకు చాలా హ్యాపీ ఐన విషయం ఏమిటి అంటే 13 ఇయర్స్ గా తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్ నే పెళ్లి చేసుకుంటున్నా. ఐతే బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు లేనే లేదు. పెళ్లి కూతురిగా రెడీ అయ్యి బిగ్ బాస్ సెట్ కి వచ్చి మీ నుంచి విషెస్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పింది నేహా చౌదరి.

ఇక నాగార్జున కూడా ఆమెకు అనిల్ కి ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఇక అలా బిగ్ బాస్ సెట్ నుంచి పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకుంది నేహా.