English | Telugu

గీతూ కంటే బావగారే బెటర్ అన్న బాలాదిత్య..యజ్ఞ విధాత్రికి అర్ధం అడిగిన నాగ్


బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి ఎక్స్ హౌస్ మేట్స్ ని అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని ఇన్వైట్ చేశారు. ఇక ఎక్స్ హౌస్ మేట్స్ తో హోస్ట్ నాగ్ మాట కలిపారు.

"బాలన్న యజ్ఞ విధాత్రి ఎలా ఉంది" అనేసరికి "మా అమ్మాయి పేరు మీ నోటి నుంచి వినడం చాలా ఆనందంగా ఉంది" అన్నాడు బాలాదిత్య. "యజ్ఞ విధాత్రి అంటే అర్ధం చెప్పు" అనేసరికి "పవర్ అలాగే సరస్వతి దేవి" అని చెప్పాడు అంటే "సరస్వతి దేవి విత్ పవర్ అన్నమాట" అన్నారు నాగ్. "నీ సిగరెట్ అలవాటు ఎలా ఉంది" అనేసరికి "అంతా క్లోజ్ సర్ ప్రస్తుతానికి ఏమీ లేదు" అన్నాడు బాలాదిత్య. "నేను మా అమ్మ మనసుతో పాటు ఎంతో మంది అమ్మలా మనసును గెలుచుకున్నాను అది చాలా హ్యాపీ.

ఇక మా చెల్లి గీతుతో నా రిలేషన్ బిగ్ బాస్ హౌస్ లో కంటే కూడా చాలా బాగుంది. గీతూ హౌస్ లో కంటే బయట బాగుంది. ఎందుకంటే బయట బావగారు కూడా ఉన్నారు కదా. గీతూ కంటే బావగారే చాలా బెటర్ ఎందుకంటే ఆయన బంగారం, గీతూ వజ్రం" అని చెప్పాడు బాలాదిత్య.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.