English | Telugu

నడవడానికి ఇంకో నెల టైం పడుతుంది...అందుకే ఇంట్లోంచి షార్ట్స్ చేస్తున్నాను


రౌడీ రోహిణి బుల్లితెర మీద చాలా తక్కువ కాలంలో ఫేమస్ ఐన ఆర్టిస్ట్. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది. మొదటి లేడీ టీమ్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు . ఇప్పుడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో కూడా బిజీగా మారిపోయారు రోహిణి. రీసెంట్ గా "సేవ్ ది టైగర్స్" అనే వెబ్ సిరీస్ లో రోహిణి కామెడీ రోల్ కి ఆడియన్స్ చాలామంది ఫాన్స్ ఇపోయారు. అలాంటి రోహిణి చాలా కాలం క్రితం ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ టైములో ఆమె కాలికి తీవ్ర గాయమయ్యింది. దాంతో అప్పుడు ఆమె కుడి కాలులో ఒక రాడ్ వేశారు.

కొంతకాలం తర్వాత ఆ రాడ్ తీసేయాలని చెప్పారట డాక్టర్స్. కానీ రోహిణి కెరీర్ లో బిజీగా ఉండటంతో హాస్పిటల్ వెళ్ళలేదు. ఇక రీసెంట్ గా లాస్ట్ మంత్ లో ఆమె హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. దాదాపు 10 గంటలు కష్టపడి డాక్టర్స్ ఆ రాడ్డును తొలగించారు. అప్పటి నుంచి రోహిణి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు నెమ్మదిగా కోలుకుని మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా ఫాన్స్ తో ముచ్చట్లు పెట్టింది రోహిణి. చాలామంది చాల ప్రశ్నలు అడిగారు. "మీ హెల్త్ కండిషన్ ప్రస్తుతానికి ఓకే నా" " నడవడానికి ఇంకో నెల సమయం పడుతుంది" "మీ కంబ్యాక్ కోసం వెయిటింగ్" " నేను కూడా వెయిటింగ్" మీరు నాకు రౌడీ రోహిణి కాదు..ఒక పెర్ఫార్మర్ ఏ ట్రూ రాక్ స్టార్" థ్యాంక్యూ" "షూట్స్ కి వెళ్తున్నారా" "లేదు వెళ్లడం లేదు...నడవడానికి ఇంకో నెల సమయం పడుతుంది..ఇంట్లో నుంచి షార్ట్ వీడియోస్ చేస్తున్నాను" అని చెప్పింది రోహిణి.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.