English | Telugu

Bigg Boss 9 Telugu : భరణితో బలగం2.. బిగ్ బాస్ హౌస్ లో కొత్త కుటుంబం!

బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటే రాసి పెట్టి ఉండాలని, వన్ టైమ్ ఆచీవ్మెంట్ అని అంటారు. హౌస్ లోకి వచ్చి కాస్త ఫేమ్ సంపాదించి తమకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ హిస్టరీ లోనే లేని విధంగా ఈ సీజన్ లో ఎన్నో బంధాలు పెనవేసుకొని ఉన్నాయి. కంటెస్టెంట్స్ కప్ కోసమో లేక బంధాలు పెంచుకోవడం కోసమో ఈ సీజన్-9 కి వచ్చారో అర్థమవ్వడ‌ం లేదు.

బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఒక మమతల కోవెల.. అందులో అన్ని బంధాలు ఉంటాయని చెప్పిన ఏకైక సీజన్ ఏదంటే అది బిగ్ బాస్ 9. ఈ సీజన్-9 ఇంటి పెద్ద ఎవరంటే మన రేలంగి మావయ్య భరణి.. అతనే మహావృక్షం. అతనికి ఇద్దరు కూతుళ్లు.. చిన్న కూతురు దివ్య, పెద్ద కూతురు తనూజ. ఇక కంటెస్టెంట్స్ అందరు కూడా అన్నయ్య, బాబాయ్, మామ అంటూ భరణిని పలకరిస్తుంటారు. ఇలా భరణికి పెద్ద బలగమే ఉంది. ఈ సీజన్ అయ్యాక భరణితో బలగం-2 తీసిన పెద్ద హిట్టే అవుతుంది. ఎందుకంటే అలా అన్ని బంధాలని పెనవేసుకున్నాడు భరణి. ఇక బంధాలకి పుట్టినిళ్ళుగా మారింది సీజన్-9 బిగ్ బాస్ హౌస్.

మరోవైపు హౌస్ లో లవ్ ట్రాక్ లు కూడా ఉన్నాయి. అసలు హౌస్ లోకి ఏ పర్పస్ తో వచ్చారన్న విషయమే మర్చిపోయారు కొందరు. మన యువ జంట రీతూ చౌదరి, డీమాన్ పవన్ సందు దొరికితే చాలు హగ్ ఇచ్చుకుంటున్నారు. హౌస్ లో ఈ ఇద్దరు కరువులో ఉన్నట్లు వారి చేష్టలున్నాయి. ఇక కళ్యాణ్, తనూజ వీళ్లు లవ్ ట్రాక్ నడపలేకపోయారు. ఎందుకంటే కళ్యాణ్ కంటే తనూజ రెండేళ్లు పెద్దదట.. వీళ్లతో ఏమాయ చేసావే-2 తీస్తే సెట్టు.

బిగ్ బాస్ హౌస్ లో పెనవేసుకున్న ఇంకొక బంధం తల్లి, కొడుకుల బంధం. సంజన, ఇమ్మాన్యుయల్.. ఇద్దరి బాండింగ్ చూస్తుంటే సొంత తల్లీకొడుకులు కూడా అలా ఉండరేమో.. మమ్మీ అంటూ ఇమ్మాన్యుయల్ బిడ్డ అంటూ సంజన.. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. తాజాగా ఒక ఎపిసోడ్ లో.. నా తల్లి తర్వాత సంజనని అమ్మ అని పిలిచానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. తన కోసం ఈ పాట అంటూ సువ్వి సువ్వాలమ్మ పాటని పాడి వినిపించాడు. దీన్ని బట్టి చూస్తే అందరు గేమ్స్ కంటే బంధాలకి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. వెళ్ళందరు కెమెరా స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నారా లేదంటే నిజమైనా ఎమోషనా అనేది తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.