English | Telugu

ఆదర్శ్ ని తీసుకొస్తానని ముకుందకి మాటిచ్చి‌న మురారి!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -73 లోకి అడుగు పెట్టింది. కాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో... ఆదర్శ్ రావాలని కృష్ణ మురారిలు చేస్తోన్న వ్రతం పూర్తవుతుంది. కుటుంబమంతా ఆదర్శ్ త్వరగా ఇంటికి రావాలని కోరుకుంటారు.

పూజ పూర్తయిన తర్వాత.. "ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా.. కృష్ణతో కలిసి పూజ చేసినందుకు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావ్" అని మురారితో అంటుంది ముకుంద. అదేంటి అలా అంటున్నావ్... నీ భర్త రావాలనే కదా చేసిందని మురారి అనగా.. "ఆదర్శ్ వచ్చినా కూడా నేను ఇలానే ఉంటానేమో" అని ముకుంద అంటుంది. "ఇప్పుడైనా నీ మీద కొద్ది ప్రేమ ఉంది.. ఆ తర్వాత ఈ మాత్రం ప్రేమ కూడా ఉండదు" అని మురారి చెప్పేసి తన గదిలోకి వెళ్లిపోతాడు.

ముకుంద గురించి నేను మీతో మాట్లాడాలని మురారితో చెప్తుంది కృష్ణ. తన గురించి ఏం ఉంది మాట్లాడడానికి అని మురారి అంటాడు. "పూజ చేస్తున్నంత సేపు ముకుంద ముఖంలో ఆదర్శ రావాలి అన్నట్లు కాకుండా.. వస్తే ఏంటి రాకపోతే ఏంటి అన్నట్లు ఉంది.. అసలు ఆదర్శ్ అంటే ఇష్టం లేదేమో.. ముకుంద ఎవరినో ప్రేమిస్తున్నట్టుంది" అని కృష్ణ అనగానే.. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది వినేసిందా ఏంటని టెన్షన్ పడిన మురారి.. "నీకెలా తెలుసు" అని అడుగుతాడు. నేను సైకాలజి స్టూడెంట్ ని. నాకు అన్నీ తెలిసిపోతాయ్ అనగానే.. నీ ప్రాక్టీస్ ఇంట్లో వాళ్ళపై కాకుండా బయట వాళ్ళ మీద ఉపయోగించు అని మురారి అంటాడు. మరొక వైపు రేవతి, భవాని దగ్గరికి వెళ్లి.. "వ్రతం చేసాం కదా.. ఇది మాత్రం సరిపోదు కదా అక్కా.. మానవ ప్రయత్నం కూడా చేయాలి. మనం కూడా వెతికించాలి" అని భవానీతో రేవతి చెప్తుంది. అవును రేవతి అని భవాని అంటుంది. ఇంతలోనే మధ్యలో కృష్ణ కలుగజేసుకుని.. "ACP సర్ ని పంపించి అక్కడి ఆఫీసర్స్ తో మాట్లాడమని చెప్పండి" అని చెప్పేలోపే మురారి వస్తాడు. " ఏం అంటావ్ మురారి?" అని రేవతి అనగా.. "నేను దాని గురించే ఆలోచిస్తున్నా" అని మురారి అంటాడు. ఆదర్శ్ ని తీసుకొస్తానని ముకుందకి మాట ఇవ్వండని మురారిని అడుగుతుంది కృష్ణ. దానికి మురారి సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.