English | Telugu

మనిద్దరి ప్రేమ విషయం మీ అమ్మకి తెలిసిపోయింది మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -173లో.. కృష్ణ, మురారిలు దారిలో పరిచయమైన ఆ అమ్మాయి అబ్బాయిల ప్లేస్ లో వాళ్లే ఉన్నట్లు మాట్లాడుకుంటారు. ప్రేమిస్తే ఆ అమ్మయిని పెళ్లి చేసుకోవాలి లేదా మర్చిపోవాలని కృష్ణ అంటుంది. బలవంతంగా పెళ్లి చేసుకున్నా ప్రేమించాలని అనుకోవద్దని కృష్ణ అనేసరికి మురారి డల్ అవుతాడు. ఆ తర్వాత అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. అలా వెళ్తుండగా కృష్ణ మురారిలు కూడా వాళ్ళిద్దరిలా వెళ్ళినట్టుగా ఊహించుకుంటారు.

మరొకవైపు మధు స్క్రిప్ట్ రాస్తుంటే.. అలేఖ్య వచ్చి డిస్టబ్ చేస్తుంది. ఈ కుటుంబంలో ఆదర్శ్, మురారి ఎంతో నువ్వు కూడా అంతే.. వెళ్లి మీ నాన్నని డబ్బులు అడుగు అని అలేఖ్య మధుని పంపిస్తుంది. మరొకవైపు మురారి కోసం ముకుంద ఎదురుచూస్తుండగా.. అప్పుడే మురారి వస్తాడు. మురారి నీకోసమే వెయిట్ చేస్తున్నా అని ముకుంద అంటుంది. దాంతో మురారి చిరాకుపడుతూ మాట్లాడుతాడు. నువ్వు నా గురించి వెయిట్ చేయడమేంటని మురారి అనగానే.. ఆఫీస్ టెన్షన్ ని ఇంటి వరకు ఎందుకు తీసుకొస్తావ్? ఇంటికి వచ్చాక నిన్ను హ్యాపీగా ఉంచడానికి నీ ప్రేయురాలిని నేను ఉన్నాను కదా అని ముకుంద అంటుంది. నాకు ఒక ఇల్లాలు ఉందని మురారి అంటాడు.

మీ అమ్మ గారికి మన విషయం తెలిసిందని ముకుంద అంటుంది. నువ్వు చెప్పవా అని మురారి అడుగుతాడు. ఆమెకి ముందే తెలిసింది. ఇప్పుడు నన్ను అడిగిందని ముకుంద అనగానే.. అడిగితే అదంతా ఏం లేదని చెప్పొచ్చు కదా.. ఇప్పుడు మా అమ్మకి ఎలా ఎదురుపడగలనని మురారి అంటాడు. నువ్వేం నేరమొ గోరమో చెయ్యలేదు.. ప్రేమించావు.. అంతే అని ముకుంద అంటుంది. కృష్ణ వెళ్ళాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ముకుంద అనగానే.. నువ్వు మాటి మాటికి కృష్ణ వెళ్ళిపోతుందని అనకు.. వినడానికి చాలా కష్టంగా ఉందని మురారి అంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు ప్రసాద్ దగ్గరికి వాళ్ళ కొడుకు మధు వచ్చి.. మనీ ఇవ్వమని అడుగుతాడు. నేను ఇవ్వను వాళ్ళలాగా కష్టపడి చదువుకొని సెటిల్ అయితే.. నన్ను డబ్బులు అడిగే పరిస్థితి రాకపోయేది కదా అని ప్రసాద్ అంటాడు. ఎలాగైనా గొప్ప స్థాయికి వెళ్తానని చెప్పి మధు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ తనతో అన్న మాటలని మురారి గుర్తుచేసుకుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. కృష్ణ కూడా మురారి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.