English | Telugu

స్వప్నని రాహుల్ పెళ్ళి చేసుకోకపోతే న్యాయపోరాటం చేస్తానన్న కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -112 లో... కావ్య ఇదంతా కావాలనే చేస్తుందని రాహుల్ అనగానే.. రాహుల్ చెంప పగలగొడతాడు రాజ్.. నన్ను ఇంత మోసం చేస్తావా అని అంటాడు. ఆ రోజు డైమండ్ రింగ్ స్వప్నకి గిఫ్ట్ గా ఇస్తానంటే వద్దని నువ్వు తీసుకెళ్లి ఇచ్చావ్.. నాకేది కావాలో నీకు అది కావాలి.. చిన్నప్పటి నుండి కలిసి పెరిగావని ప్రతీది ఇస్తూ వచ్చాను. చివరికి నేను పెళ్లి చేసుకుంటా అనుకున్న స్వప్న ని లేవదీసుకుపోయి ఇంటి పరువు తీసావని రాజ్ కోప్పడతాడు.

ఆ తర్వాత ముసుగు వేసి ఆ అమ్మాయితో పెళ్లి జరిగేలా చేసింది మీరే కదా అని అపర్ణ అంటుంది.. వదిన ఇదంతా ఏదో కుట్రలా ఉందని రుద్రాణి అనగానే.. ఏం కుట్ర ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడని రాహుల్ ని సీతారామయ్య తిడతాడు. "ఏంటి అపర్ణ ఇది.. నీ మీద నమ్మకం ఉంచి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను.. రాహుల్ ఇలాంటి వాడని నువ్వు చెప్పాలి కదా.. ఈ విషయం పెళ్లి అయ్యాక తెలిస్తే నా కూతురు జీవితం ఏం అయ్యేది. కట్టుకున్న భార్యని ఆడదాని లాగా చూడడు నీ కొడుకు. నువ్వేమో కోడలిని పని మనిషిలా చూస్తావ్" అని అపర్ణని నిలదీస్తుంది అరుంధతి. అపర్ణ సైలెంట్ గా ఉండిపోతుంది. కావ్య నువ్వు రాహుల్ గురించి ముందే చెప్పి మాకు హెల్ప్ చేసావ్. నీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియట్లేదని అరుంధతి అంటుంది. ఆ తర్వాత రాహుల్ మొహంపై వెన్నెల రింగ్ ని పడేస్తుంది. కాసేపటికి అరుంధతి, వెన్నెల ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు స్వప్న చేసిన పనికి కనకం ఏడుస్తుంటుంది. అప్పుడే కావ్య, స్వప్న, అప్పు లు కనకం ఇంటికి వెళ్తారు. కావ్య జరిగిందంత కనకం, కృష్ణ మూర్తిలకు చెప్తుంది. అక్క ఇలా మోసపోవాడనికి కారణం రాహుల్ అని చెప్తుంది. రాహుల్ దుగ్గిరాల కుటుంబంకి సంబంధించిన మనిషి కాదు. తాతయ్య గారు తన మేనేజర్ కూతురు రుద్రాణిని పెంచి తన సొంత కూతురులా చూసుకున్నారని కావ్య చెప్తుంది.

మరొకవైపు రాహుల్ ని ఎంత పని చేసావ్ రా అంటూ రుద్రాణి తిడుతుంది. కోట్ల ఆస్తి చెయ్యి జారీపోయింది.. ఇకనైనా ఇద్దరం సమన్వయంగా ఉండి స్వప్నని ఎలాగైనా తప్పించాలని రుద్రాణి అంటుంది. మరొకవైపు రాహుల్, స్వప్నల పెళ్లి చేయడానికి సీతరామయ్య, ఇందిరాదేవి, రాజ్ లు కనకం ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.