English | Telugu

అవకాశాలు రావనే భయంతో పెళ్లి గురించి చెప్పలేదు

యాంకర్ రవికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనోడికి మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తోనే బిగ్ బాస్ 5 తెలుగులో తన సత్తా చాటాడు. మూవీ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్ కి హోస్ట్ గా ఉంటూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అలాంటి రవి ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు." మా మ్యూజిక్ లో సంథింగ్ స్పెషల్ ఎంతగా ఫేమస్ అయ్యిందో ఎంతగా టీఆర్పీ రేటింగ్ వచ్చేదో అందరికీ తెలుసు. ఇప్పటికీ బయటికి వెళ్తే సంథింగ్ స్పెషల్ గురించే మాట్లాడతారు చాలామంది. అప్పుడే పెళ్లయ్యింది నాకు.

పెళ్లి అయ్యిందని తెలిస్తే ఒక యూత్ ఫుల్ ఫీల్ పోయి ఎక్కడ అంకుల్ ఫీల్ వస్తుందో అని ఒక రాంగ్ వేలో థింక్ చేసాను. పెళ్లయిపోయింది కాబట్టి అవకాశాలు రావు అనే ఒక భయం ఉండేది. యూత్ లో ఉన్నప్పుడు గర్ల్ ఫాన్స్ ఉండాలని..వాళ్ళు నిన్ను మెచ్చుకోవాలని అనుకుంటారు చాలామంది. అదే పెళ్ళైపోతే అంకుల్ ఇపోతాం అనేది నా మైండ్ లో ఉండిపోయింది. ఐతే ఆ తర్వాత చాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం నేను, నిత్యా..ఏ యాంకర్ తో చేస్తే ఆ యాంకర్ తో లింకప్ చేస్తూండేసరికి పటాస్ షో టైంలో నేను మా పెళ్లి ఫోటో రిలీజ్ చేశా. అప్పుడప్పుడే సోషల్ మీడియా బాగా డెవలప్ అవుతూ వస్తోంది. నిత్యా మా అందరి హెల్త్ గురించి బాగా చూసుకుంటుంది. మా అమ్మాయి వియ ఐస్ క్రీమ్స్, చాకోలెట్స్ అస్సలు తినదు. ఒక్క ఆదివారాల్లోనే తింటుంది. ఇంట్లో అమ్మాయి పుడితే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది." అంటూ ఎన్నో విషయాలు చెప్పాడు యాంకర్ రవి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.