English | Telugu

Maryada Manish Elimination: మర్యాద మనీష్ ఎలిమినేషన్.. సూపర్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో అప్పుడే సెకెండ్ వీకెండ్ వచ్చేసింది. మొన్నటి టాస్క్ లో గెలిచి డీమాన్ పవన్ సెకెండ్ కెప్టెన్ అవ్వగా.. నిన్న జరిగిన టాస్క్ లో గెలిచి రాము రాథోడ్ సెకెండ్ ఓనర్ అయ్యాడు. నామినేషన్ లో‌ మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన కంటెస్టెంట్స్ పై నెగెటివిటి ఏర్పడింది. ఏం మాట్లాడతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నారు.. మొదటి వారం సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా.. ఈ వీక్ పక్కాగా ఒక కామనర్ వెళ్లిపోవడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే ఓటింగ్ అలా పడుతుంది. శుక్రవారం రాత్రి ఓటింగ్ ముగిసే సమయానికి సుమన్ శెట్టి అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో భరణి ఉండగా.. మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. నాలుగో స్థానంలో డీమాన్ పవన్, అయిదో స్థానంలో ఫ్లోరా సైనీ, ఆరో స్థానంలో ప్రియశెట్టి ఉండగా.. చివరి స్థానంలో మర్యాద మనీష్ ఉన్నాడు.

గత వారంలో ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అవుతుందని అందరు భావించారు కానీ లాస్ట్ మినిట్ లో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఈ వారం లీస్ట్ లో ప్రియ, మనీష్ ఉన్నారు. వీళ్ళిద్దరు హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన వాళ్ళే. అయితే ఈ వారం మర్యాద మనీష్ పెద్దగా ఆడిందేమీ లేదు. పైగా నెగెటివిటి పెరిగింది. కామనర్స్ మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, ప్రియాలపై ట్రోల్స్ మాములుగా లేవు. వీరి బిహేవియర్ చూసి అనవసరంగా బిగ్ బాస్ కి సెలెక్ట్ చేశారని ఆడియన్స్ భావిస్తున్నారు. మరి ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.