English | Telugu
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ హీరోయిన్ జాస్మిన్ రాత్ ఎవరంటే
Updated : May 4, 2023
ఒడియా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో జాస్మిన్ రాత్ తన నటనతో రాణిస్తోంది. జాస్మిన్ 2019 లో జీ సార్థక్ లో 'సర్గం' అనే సీరియల్ తో అరంగేట్రం చేసింది. తర్వాత "మాయ, మా జహారా సహ" ఇప్పుడు "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" వంటి సీరియల్స్‌లో నటించింది. జాస్మిన్ జనవరి 10, 2002న ఒడిశాలోని భువనేశ్వర్‌లో పుట్టింది. జాస్మిన్ భువనేశ్వర్‌లోని ప్రభుజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో స్కూలింగ్ కంప్లీట్ చేసింది. బాంబే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2018లో, జాస్మిన్ రాత్ మోడలింగ్‌లో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. తర్వాత "ఇ సమయ, రూపసి జన్హా, జానీ తు అజానా, హేలా కి ప్రేమ, తు మోరీ దునియా" మొదలైన మ్యూజిక్ ఆల్బమ్స్ లో చేసింది. ఆమె ట్రైన్డ్ ఒడిస్సీ డ్యాన్సర్ కూడా. ఇంటిగ్రేటెడ్ బిఏఎల్ఎల్ బి కూడా చేసింది. 2020లో జాస్మిన్ తరంగ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన "మాయ" అనే సీరియల్‌లో రుద్రి అనే లీడ్ రోల్ లో నటించింది.
అలాగే 2022 జీ సార్థక్ టీవీలో "మా జహారా సాహా" అనే సీరియల్ ల్లోనూ ఇప్పుడు స్టార్ మాలో "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" సీరియల్‌తో తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలోకి జాస్మిన్ అరంగేట్రం చేసింది. సోనమ్ కపూర్ యాక్టింగ్‌ని రిఫరెన్స్‌గా తీసుకుని ‘ప్యాడ్‌మాన్’ మూవీలో ఒక చిన్న స్కిట్ కూడా చేసింది. హిందీ నటి శ్రద్దాకపూర్ , ఒడియా నటి రచనా బెనర్జీ మూవీస్ చూపించి ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ఇష్టమట. తనకు తానె ఇన్స్పిరేషన్ అని అంటుంది. అలాగే 'హేల కి ప్రేమ 2' తో పాటు మరి కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ ఆఫర్స్ ఉన్నాయట. ఐతే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎవరూ ఎప్పుడూ శాశ్వతం కాదు కాబట్టి చదువు ద్వారానే స్థిరత్వం ఉంటుందంటుంది జాస్మిన్. ఇక నటన, నాట్యం రెండూ ప్యాషన్ మాత్రమేనట.